Rashmika Mandanna Shooting with Bollywood star Varun Dhawan: 'ఛలో' సినిమాతో రష్మిక మందన్న టాలీవుడ్‌కి పరిచయం అయిన విషయం తెలిసిందే. మొదటి సినిమానే మంచి హిట్ కొట్టడంతో తెలుగు ఇండస్ట్రీలో వరుస అవకాశాలు వచ్చాయి. ఓ వైపు అందం, మరోవైపు నటనతో ఆకట్టుకుంటూ.. అనతి కాలంలోనే స్టార్ హీరోలతో జతకట్టారు. వచ్చిన అవకాశాలను ఒడిసిపడుతూ సౌత్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్‌గా ఎదిగారు. ఇక రష్మిక చేసిన ప్రతి సినిమా హిట్ కావడంతో 'గోల్డెన్ లెగ్' అనే ముద్ర కూడా ఉంది. దాంతో దర్శకనిర్మాతలు ఆమె డేట్స్ కోసం క్యూ కడుతున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'సరిలేరు నీకెవ్వరూ' సినిమాతో భారీ హిట్ అందుకున్న నేషనల్ క్రష్ రష్మిక.. ఇటీవల స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వచ్చిన 'పుష్ప' సినిమాతో మరో హిట్ ఖాతాలో వేసుకున్నారు. పుష్ప కేవలం తెలుగులోనే కాకుండా అన్ని భాషలలో విజయవంతం కావడంతో పాన్ ఇండియా స్థాయిలో రష్మికకు మంచి క్రేజ్ ఏర్పడింది. ప్రస్తుతం దక్షిణాదిలో స్టార్‌ నాయికల్లో ఒకరిగా ఉన్న కన్నడ బ్యూటీ.. ఇప్పుడీ జోరును ఉత్తరాదిలోనూ కొనసాగించేందుకు ఉవ్విళ్లూరుతున్నారు.


రష్మిక బాలీవుడ్‌లో ఇప్పటికే 'మిషన్‌ మజ్ను', 'గుడ్‌బై' చిత్రాలు పూర్తి చేశారు. ఈ రెండు సినిమాలు వేసవిలో విడుదల కానున్నాయి. సిద్ధార్థ్‌ మల్హోత్రా నటించిన మిషన్‌ మజ్ను సినిమాతో బాలీవుడ్‌కు రష్మిక పరిచయం అవుతున్నారు. మెగాస్టార్ అమితాబ్‌ బచ్చన్‌ లీడ్‌ రోల్‌ చేసిన 'డాడీ' (వర్కింగ్ టైటిల్‌) సినిమాలో కూడా లీడ్‌ రోల్ చేశారు. బాలీవుడ్ బడా నిర్మాత కరణ్‌ జోహార్‌ సినిమాలో కూడా కన్నడ బ్యూటీకి ఆఫర్‌ దక్కినట్లు సమాచారం. ఈ సినిమా విషయమై జనవరి 24న రష్మిక ముంబైలోని కరణ్ కార్యాలయంకు వెళ్లి వచ్చారు. అధికారిక ప్రకటన త్వరలో రానుంది.


ఇక బాలీవుడ్‌లో రష్మిక మందన్నకు మరో క్రేజీ ఆఫర్ దక్కినట్టు తెలుస్తోంది. యువ హీరో వరుణ్‌ ధావన్‌తో రష్మిక జత కట్టిందని ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీ చుస్తే తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఇద్దరు షూట్‌లో ఉన్నారు. ఈరోజు ఎవరితో షూటింగ్ చేస్తున్నానో ఊహించండి', 'ఫ్రమ్‌ వర్కౌట్స్‌ టు షూటింగ్‌.. హ్యాపీ ఫేసెస్‌' అంటూ రష్మిక రాసుకొచ్చారు. వరుణ్‌తో చిరునవ్వులు చిందిస్తున్న ఫోటోను కూడా తన స్టోరీలో షేర్‌ చేశారు. దీంతో వరుణ్‌తో రష్మిక స్క్రీన్‌ షేర్‌ చేసుకుంటున్న విషయం స్పష్టమైంది. అయితే ఈ ఇద్దరూ నటిస్తున్నది యాడ్‌ కోసమా? లేదా సినిమానా కోసమా? అన్న విషయం తెలియాల్సి ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో కింగ్ ఫిషర్ బ్యానర్ కనపడుతుండడంతో అది యాడ్‌ అని అర్ధం చేసుకోవచ్చు. 


Also Read: LavanyaTripathi Latest Pics: గ్లామర్ డోస్ పెంచేసిన లావణ్య త్రిపాఠి.. ఇలా ఎప్పుడూ చూసుండరు!!


Also Read: Jr NTR Fans: మొదలైన ఆర్‌ఆర్‌ఆర్‌ మేనియా.. ఏకంగా థియేటర్‌నే బుక్ చేసిన ఎన్టీఆర్ ఫ్యాన్స్‌! ఎక్కడో తెలుసా?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook