Rashmika Workout Video నేషనల్ క్రష్ రష్మిక మందాన్నకు ప్రస్తుతం ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే. రోజురోజుకూ క్రేజ్ పెంచుకుంటూనే పోతోంది. అయితే అదే సమయంలో ఆమె మీద విపరీతమైన నెగెటివిటీ కూడా ఉంటుంది. మరీ ముఖ్యంగా ఆమె సొంత రాష్ట్రమైన కర్ణాటక నుంచి ఎక్కువగా నెగెటివిటీ ఉంటుంది. మొన్నటికి మొన్న రష్మిక మీద కన్నడ ఇండస్ట్రీ బ్యాన్ విధించిందనే రూమర్లు కూడా వచ్చాయి. కాంతారా యూనిట్, రిషభ్ శెట్టితో కోల్డ్ వార్ జరిగిన సంగతి తెలిసిందే.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కాంతారా సినిమా రష్మిక వివాదం చిలికి చిలికి గాలి వానలా మారింది. చివరకు ఆమె నటించిన వారసుడు సినిమాను కన్నడలో ఆడనివ్వలేదని టాక్. దీంతో రష్మిక తన తప్పును తెలుసుకున్నట్టుంది. రీసెంట్‌గా రష్మిక ఇచ్చిన ఇంటర్వ్యూలో రిషభ్ శెట్టి, రక్షిత్ శెట్టి గురించి గొప్పగా చెప్పింది. నిజాయితీగా చెప్పాలంటే వారిద్దరే వల్లే నాకు ఈ లైఫ్ వచ్చిందని, వారే తనకు మొదటి అవకాశం ఇచ్చారంటూ చెప్పుకొచ్చింది.


తనను జనాలు ఎందుకు అంతగా ద్వేషిస్తారో తెలియడం లేదని, తాను ఊపిరి తీసుకున్నా తప్పే.. తీసుకోకపోయినా తప్పే.. మాట్లాడినా తప్పే.. మాట్లాడకపోయినా తప్పే అన్నట్టుగా చూస్తారు. అసలేం చేయాలో చెప్పండి.. మీరు ఎలా చెబితే నేను అలానే చేస్తాను.. అంటూ రష్మిక తన బాధను పంచుకుంది.


 





మొదట్లో ఈ ట్రోలింగ్ తన వరకు మాత్రమే ఉండేదని, అప్పుడు తనకు ఎలాంటి బాధను కలిగించలేదని, కానీ ఇప్పుడు ఆ ట్రోలింగ్ తన ఫ్యామిలీ వరకు వెళ్లిందని, ఎనిమిదేళ్ల తన చెల్లిని కూడా ట్రోల్ చేస్తున్నారని, అది తనకు చాలా బాధను  కలిగిస్తుందని రష్మిక వాపోయింది. అయితే రష్మిక మాత్రం ఎప్పుడూ కూడా స్ట్రాంగ్ ఉమెన్‌లా ఉండాలని అనుకుందట. అయితే తాను ఎప్పుడూ స్ట్రాంగ్‌గానే ఉన్నానంటూ ఇలా వర్కౌట్ వీడియోను షేర్ చేసింది.


 


Also Read:  Hunt Telugu Movie Review : హంట్ రివ్యూ.. సుధీర్ బాబు డేరింగ్ స్టెప్ 


Also Read: Sharwanand Engagement: ఘనంగా హీరో శర్వానంద్‌ ఎంగేజ్‌మెంట్‌.. వైరల్ పిక్స్!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి