Rashmika Mandanna: రష్మిక మందన్న పారితోషికం ఎంతో తెలుసా ?
కన్నడ బ్యూటీ రష్మిక మందన ఇప్పుడు టాలీవుడ్ నిర్మాతలకు లక్కీ మస్కట్‌గా మారింది. ఈ ఏడాదిలో సరిలేరు నీకెవ్వరు, భీష్మ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టిన రష్మిక మందన్నకు టాలీవుడ్‌లో అటు ఆడియెన్స్ నుంచి ఫాలోయింగ్ ఎంత భారీగా పెరిగిందో ఇటు నిర్మాతల నుంచి ఆఫర్స్ కూడా అదేస్థాయిలో క్యూ కడుతున్నాయి.
కన్నడ బ్యూటీ రష్మిక మందన ఇప్పుడు టాలీవుడ్ నిర్మాతలకు లక్కీ మస్కట్‌గా మారింది. ఈ ఏడాదిలో సరిలేరు నీకెవ్వరు, భీష్మ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టిన రష్మిక మందన్నకు టాలీవుడ్‌లో అటు ఆడియెన్స్ నుంచి ఫాలోయింగ్ ఎంత భారీగా పెరిగిందో ఇటు నిర్మాతల నుంచి ఆఫర్స్ కూడా అదేస్థాయిలో క్యూ కడుతున్నాయి. రష్మిక డేట్స్ హాట్ కేకుల్లాగా అమ్ముడవుతున్నాయి. ఈ రెండు చిత్రాల తర్వాత వచ్చే ఏడాది కోసం ప్రస్తుతం రష్మిక చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. సుల్తాన్, పొగరు, పుష్ప, ఆడాళ్లు మీకు జోహార్లు వంటి చిత్రాలకు రష్మిక సైన్ చేసింది.
రష్మిక మందనకు ( Rashmika Mandanna ) ఉన్న క్రేజ్‌ని క్యాష్ చేసుకునేందుకు నిర్మాతలు ప్రయత్నిస్తోంటే... దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని అన్నట్టు రష్మిక కూడా ఇదే రైట్ టైమ్ అని తన రెమ్యునరేషన్ పెంచేసిందట. అతి కొద్ది సినిమాలతోనే భారీ క్రేజ్ ఏర్పడటంతో ఇటీవల సైన్ చేసిన సినిమాలకు ఒక్కో సినిమాకు రూ. 2 కోట్లు చార్జ్ చేస్తోందట. మరోవైపు నిర్మాతలు సైతం ఇక తప్పదన్నట్టు రష్మిక మందన అడిగినంత పారితోషికం ఇచ్చి మరీ ఆమె కాల్ షీట్స్ తీసుకుంటున్నట్టు ఫిలింనగర్ టాక్.
Also read : Akkineni Nagarjuna: పుకార్లపై క్లారిటీ ఇస్తూ.. మన్మథుడి దీపావళి విషెస్
రష్మికది లక్కీ హ్యాండ్ అని.. ఆమె నటించిన చిత్రాలకు ఆడియెన్స్ నుంచి ఆధరణ ఉంటోంది కనుక పారితోషికం ( Rashmika Mandanna remuneration ) విషయంలో ఇక ఆలోచించాల్సిన అవసరం లేదని నిర్మాతలు చెబుతున్నారట. ఏదేమైనా తక్కువ సినిమాలతో ఎక్కువ నేమ్ అండ్ ఫేమ్‌తో పాటు రెమ్యునరేషన్ కూడా సంపాదించుకుంటున్న రష్మిక నిజంగానే లక్కీ మస్కట్ మాత్రమే కాదు.. లక్కీ గాళ్ కూడా కదూ...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. Android Link - https://bit.ly/3hDyh4G , Apple Link - https://apple.co/3loQYe.
మరిన్ని ఆసక్తికరమైన వార్తలు, అప్‌డేట్స్ కోసం https://www.facebook.com/ZeeHindustanTelugu పేజీని లైక్ చేయండి, ట్విటర్‌లో https://twitter.com/ZeeHTelugu పేజీని ఫాలో అవండి