Raveena tandon car accident in mumbai video viral: బాలీవుడ్ నటి రవీనా టాండన్ కు అనుకోని ఘటన ఎదురైంది. శనివారం రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నటి రవీనా టాండన్ ముంబైలోని బాంద్రా కార్టర్ రోడ్డులో.. కారును రివర్స్ చేస్తుండగా.. అది ముగ్గురిని ఢీకొట్టింది. దీంతో వారు కారు డ్రైవర్ తో గొడవకు దిగారు. కారు డ్రైవర్ కూడా ఏమాత్రం తగ్గకుండా వారిపైన రివర్స్ లో అటాక్ కు దిగాడు. రవీనా కూడా కారు దిగి బాధితుల పట్ల రాష్ గా మాట్లాడింది. దీంతో అక్కడ పెద్ద గొడవ జరిగింది. రవీనా కారు డ్రైవర్ సరిగ్గా రివర్స్ తీసుకొక పోవడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. దీంతో అక్కడున్న స్థానికులు కూడా బాధితులకు సపోర్టుగా మాట్లాడారు. రవీనాతో వాగ్వాదానికి దిగారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



ఈ నేపథ్యంలో రవీనా కారు దిగి.. తమపై దాడి చేయోద్దంటూ.. ప్లీజ్ అని అక్కడి వారిని రిక్వేస్ట్ చేశారు. అంతేకాకుండా.. వారితో కొంత కటువుగా కూడా మాట్లాడినట్లు తెలుస్తోంది. కారు ప్రమాదంలో ముగ్గురు మహిళలు గాయపడినట్లు తెలుస్తోంది. సదరు బాధితులు కూడా రవీనాకు గట్టిగానే కౌంటర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అక్కడున్న వారిని పోలీస్‌ స్టేషన్ కు తరలించి ఘటనపై ఆరాతీసినట్లు తెలుస్తోంది.


దీనిపై  ఇప్పటికి వరకు ఎలాంటి ఫిర్యాదులు అందలేదని బాంద్రా పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం ఈ ఘటన మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై రవీనా ఫ్యామిలీ మెంబర్స్, స్నేహితులు, ఫ్యాన్స్ తీవ్ర ఆందోళనకు గురౌతున్నట్లు సమాచారం. రవీనాకు ఏంకాలేదుకదా.. అంటూ ఎక్స్ లో ఆరా తీస్తున్నారు.


Read more: Snakes Video: బాప్ రే.. కింగ్ కోబ్రాకు షాంపుతో స్నానం... వీడియో వైరల్..


కానీ ఇప్పటి వరకు కూడా రవీనా దీనిపై రెస్పాండ్ కాలేదు. కాగా, ఇటీవల వాహనాల ప్రమాదాలు తరచుగా వార్తలలో ఉంటున్నాయి. కొన్ని చోట్ల ర్యాష్ డ్రైవింగ్ చేయడం వల్ల ప్రమాదాలు జరుగుతుంటే, మరికొన్ని చోట్ల మాత్రం తాగి వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. పోలీసులు ఎంతగా అవగాహన కల్పించిన.. కొందరి నెగ్లీజెన్సీ వల్ల  ప్రతిరోజు రోడ్డు ప్రమాదాలుచోటు చేసుకుంటున్నాయి. 



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter