Ravi Babu Rush Movie OTT Updates: తన విలక్షణమైన నటనతో ఆడియన్స్‌లో మంచి పేరు తెచ్చుకున్నారు నటుడు రవిబాబు. కేవలం నటుడిగానే కాకుండా డైరెక్టర్‌గానూ తన టాలెంట్‌ను నిరూపించుకున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో సినిమాలు రూపొందించడంలో ఆయన స్టైలే వేరుగా ఉంటుంది. నచ్చావులే, మనసారా అంటూ ప్రేమకథలతో మెప్పిస్తూనే.. అనసూయ, అమరావతి, అవును, అవును-2 వంటి హార్రర్ థ్రిల్లర్ చిత్రాలతో ప్రేక్షకులతో ఆడియన్స్‌ను భయపెట్టారు. తాజాగా ఆయనే స్వయంగా నిర్మించి.. కథ - స్క్రీన్ ప్లే అందించిన‌ మూవీ 'రష్'. ఈ సినిమాకు సతీశ్ పోలోజు దర్శకత్వం వహించారు. యాక్షన్ థ్రిల్లర్ జోనర్‌లో యూనిక్ పాయింట్‌తో రూపొందించిన ఈ సినిమాలో డైసీ బోపన్న ప్రధాన పాత్ర పోషించారు. ప్రస్తుతం ఈ మూవీ ప్ర‌ముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Sania Mirza: స్టార్ క్రికెటర్ తో సానియా పెళ్లి.. నెటిజన్లకు ఊహించని ట్విస్ట్ ఇచ్చిన మీర్జా తండ్రి..


ఒక సాధారణ మహిళ.. అసాధారణ పరిస్థితులు ఎదురైతే వాటిని ఆమె ఎలా ధైర్యంగా ఎదుర్కొన్నారు అనే ఆసక్తికరమైన పాయింట్‌తో రష్ సినిమాను తెరకెక్కించారు. అద్భుతమైన యాక్షన్ ఎపిసోడ్స్‌తో ఓటీటీలో ఆడియన్స్‌ను అలరిస్తోంది. రవిబాబు తీసుకువచ్చిన సోషల్ ఇష్యూ ప్రేక్షకులను తప్పకుండా ఆలోచింపజేస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రానికి ఈటీవి విన్‌లో ఆడియన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. యాక్షన్ థ్రిల్లర్ చిత్రాలను ఇష్టపడే వారికి ఈ సినిమాను తప్పకుండా నచ్చుతుంది. 


ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుండడంతో మేకర్స్ హర్షం వ్యక్తం చేస్తన్నారు. ఇటీవల మంచి కంటెంట్ తో పాటు యాక్ష‌న్, ఎమోషన్ కలిగిన‌ చిత్రాలో లిస్టులో 'ర‌ష్' సంతోషంగా ఉందన్నారు. డైరెక్టర్ సతీశ్ పోలోజు టేకింగ్.. రవిబాబు క్యారెక్టరైజేషన్.. చివర్లో ఊహించని ట్విస్ట్‌తో ఆడియన్స్‌ థ్రిల్‌కు గురవుతారని చెప్పారు. నాలుగు వైపులా నుంచి నడిచే స్టోరీ.. ఒకే పాయింట్‌ నుంచి మొదలవ్వడం కొత్తగా ఉంటుందన్నారు. తక్కువ బడ్జెట్‌లో పెర్ఫెక్ట్ కంటెంట్‌ను ఆడియన్స్‌కు అందించారు. ఈ సినిమాను ఇంకా ఎవరైనా చూడని ప్రేక్షకులు ఉంటే.. వెంటనే చూడాలని మేకర్స్ కోరారు. 


Also Read: Sexual Assault: పోర్న్‌ చూస్తూ సొంత బిడ్డపై తండ్రి లైంగిక దాడి.. నాన్న అనే పేరుకే కళంకం వీడు


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter