Sexual Assault: పోర్న్‌ చూస్తూ సొంత బిడ్డపై తండ్రి లైంగిక దాడి.. నాన్న అనే పేరుకే కళంకం వీడు

Father Sexual Assault His Own Daughter She Deny And Killed: తాగిన మైకం.. ఆపై పోర్న్‌ వీడియోలు చూడడం. ఈ సమయంలో భార్య లేకపోతే కుమార్తెతో కోరిక తీర్చుకోవాలనుకున్నాడు. బాలిక నిరాకరించడంతో అతి దారుణంగా కన్న తండ్రి హత్య చేశాడు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Jun 19, 2024, 05:20 PM IST
Sexual Assault: పోర్న్‌ చూస్తూ సొంత బిడ్డపై తండ్రి లైంగిక దాడి.. నాన్న అనే పేరుకే కళంకం వీడు

Father Not Killer: వావివరుసలు మరచిపోయిన ఓ దుర్మార్గుడు కన్న కూతురిపైనే దారుణానికి ఒడిగట్టాడు. కామం మైకంలో తన బిడ్డపైనే అత్యాచారానికి ప్రయత్నించగా బాలిక నిరాకరించింది. తన కోరికను తీర్చకపోవడంతో ఆగ్రహంతో ఊగిపోయిన అతడు అతి కిరాతకంగా హత్యకు పాల్పడ్డాడు. అనంతరం ఏమి తెలియనట్టు తన కూతురు కనిపించడం లేదంటూ నాటకాలు ఆడాడు. చివరికి అతడి దుర్మార్గాన్ని పోలీసులు కనిపెట్టి నిజం కక్కించారు. తన బిడ్డను తానే చంపినట్లు అంగీకరించడంతో అతడిని అరెస్ట్‌ చేశారు. ఈ సంఘటన హైదరాబాద్‌ శివారులో చోటుచేసుకుంది.

Also Read: Chennai: యువకుడి ప్రాణం తీసిన వైఎస్సార్‌సీపీ ఎంపీ కుమార్తె.. కారుతో చెన్నైలో హల్‌చల్‌

మియాపూర్‌లో కలకలం రేపిన బాలిక అనుమానాస్పద మృతి కేసును మియాపూర్ పోలీసులు ఛేదించారు. బాలిక వసంత(12) హత్య కేసులో ఆమె తండ్రి ప్రధాన సూత్రధారి అని తేల్చారు. మియాపూర్ ఏసీపీ నరసింహ్మా రావు సంఘటన వివరాలు వెల్లడించారు. మహబూబాబాద్ జిల్లా మర్రిపెడ మండలం ఎల్లంపేట్ గ్రామం లక్ష్మణ్‌ తండాకు బానోతు నరేశ్‌కు భార్య, కుమార్తె వసంత ఉంది. బరతుకుదెరువు కోసం నడిగడ్డ తండాకు కుటుంబంతో కలిసి వలస వచ్చాడు. అయితే అతడికి శృంగార వీడియోలు చూడడం అలవాటు.

Also Read: Darshan Manager: ఛాలెంజింగ్ స్టార్‌ దర్శన్‌ మేనేజర్‌ ఆత్మహత్య.. సంచలన మలుపు తిరిగిన కేసు

 

మద్యానికి బానిస అయిన నరేశ్‌ ఆ వీడియోలు చూస్తూ కోరికలతో రగిలిపోయేవాడు. ఈ క్రమంలో భార్య లేని సమయంలో తన కూతురిపై కన్నేశాడు. ఆ వీడియోలు చేస్తూ బాలికతో లైంగిక వాంఛ తీర్చుకోవాలని ప్రయత్నించాడు. అమ్మకు చెబుతానని బాలిక గట్టిగా అరవడంతో కోపంతో నరేష్ దాడికి పాల్పడ్డాడు. నడిగడ్డ తండా సమీపంలోని పొదల్లోకి తీసుకువెళ్లి జుట్టు పట్టుకుని నేలకేసి కొట్టాడు. అనంతరం బండరాయితో మోదీ దారుణంగా హత్య చేశాడు. బాలికను అక్కడే పడేసి ఇంటికి తిరిగివచ్చాడు. తన బిడ్డను చంపిన రోజే ఏమీ ఎరగనట్టు కూతురు కనిపించడం లేదని భార్యతో కలిసి నరేశ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే బాలిక చనిపోయిందా లేదా అని చూసేందుకు మరోసారి హత్య జరిగిన ప్రదేశానికి వెళ్లి చూసివచ్చాడు.

చంపేసి డ్రామాలు
అయితే అక్కడి స్థానికులు బాలిక మృతదేహాన్ని చూసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసును తీవ్రంగా పరిగణించిన మియాపూర్‌ పోలీసులు బాలిక ఆచూకీ కోసం ఆరా తీశారు. నాలుగు బృందాలతో సీసీ టీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. ముమ్మర దర్యాప్తు అనంతరం అసలు విషయం వెలుగులోకి వచ్చింది. తండ్రిపైనే అనుమానం వ్యక్తం చేసి తమదైన శైలిలో పోలీసులు విచారించారు. విచారణలో బానోతు నరేశ్ నేరాన్ని అంగీకరించాడు. దీంతో పోలీసులు అతడికి వైద్య పరీక్షలు నిర్వహించి రిమాండ్‌కు తరలించారు. మానవత్వాన్ని మంటగలిపేలా అతడు చేసిన నేరం సమాజానికే చేటుగా మిగిల్చింది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News