Ravi Tandon Last Rites: బాలీవుడ్ హీరోయిన్ రవీనా టాండన్ ఇంట్లో విషాదం నెలకొంది. రవీనా టాండన్‌ తండ్రి రవి టాండన్ కన్ను మూశారు. రవి టాండన్‌ ప్రముఖ రచయితగా... దర్శక నిర్మాతగా సుపరిచితం. ఎనభై ఆరేళ్ల రవి టాండన్ గత కొన్నాళ్లుగా శ్వాస కోశ సంబంధిత వ్యాధులతో ఇబ్బందులుపడ్డారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆసుపత్రిలో గత కొంతకాలంగా చికిత్స తీసుకున్నారు. ఈ క్రమంలో ముంబైలోని హాస్పిటల్‌లో చికిత్స పొందుతోన్న రవి టాండన్‌ శుక్రవారం మృతి చెందారు. రవి టాండన్ మృతితో బాలీవుడ్‌లో విషాదం నెలకొంది. 


అయితే రవి టాండన్‌ దహన సంస్కారాలను ఆయన కూతురు రవీనా టాండన్ నిర్వహించింది. రవి టాండన్‌ అంతిమ సంస్కారాలకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 



 


రవి టాండన్ మృతిపై బాలీవుడ్ ప్రముఖులంతా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. సోషల్‌ మీడియా వేదికగా పోస్ట్‌లు షేర్ చేస్తునారు. ఇక రవి టాండన్ అన్హోనీ, ఖేల్ ఖేల్ మే, మజ్బూర్, నజరానా, జిందగీ తదితర సినిమాలు తెరకెక్కించారు. ఎన్నో విజయంమైన సినిమాలను బాలీవుడ్‌కు అందించారు.


Also Read: ఐదుగురు ఆటగాళ్లపై కన్నేసిన స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్.. వారు చాలా కాస్ట్లీ గురూ!!


Also Read: విండీస్ టీ20 సిరీస్‌కు ముందు టీమిండియాకు భారీ షాక్.. ఇద్దరు స్టార్ ప్లేయర్స్ దూరం!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook