Ravi Teja - Eagle Movie OTT Streaming: రవితేజ జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస పెట్టి సినిమాలు చేస్తున్నాడు.   రీసెంట్‌గా 'ఈగల్' మూవీతో పలకరించాడు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ భారీ ఎత్తున నిర్మించింది. సంక్రాంతి కానుకగా విడుదల కావాల్సిన ఈ సినిమా తీవ్రీ పోటీ కారణంగా ఈ నెల 9న విడుదలైంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టాక్‌కు తగ్గ వసూళ్లను రాబట్టడంలో 'ఈగల్' విఫలమైంది. ఇక ఈ సినిమా ఓటీటీ రైట్స్ విషయానికొస్తే.. అమెజాన్ ప్రైమ్‌, ఈటీవీ విన్ ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను దక్కించుకుంది. మార్చి 2 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్‌కు రానున్నట్టు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ సినిమా శాటిలైట్ రైట్స్ భారీ రేటుకే అమ్ముడుపోయినట్టు సమాచారం. 


మాస్ మహారాజ్ రవితేజ విషయానికొస్తే.. లాస్ట్ ఇయర్ వాల్తేరు వీరయ్య, రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు సినిమాలతో పలకరించారు. అందులో మెగాస్టార్  తమ్ముడిగా నటించిన వాల్తేరు వీరయ్య బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. అయినా.. ఆ క్రెడిట్ మొత్తం చిరు ఖాతాలోకి వెళ్లింది. తాజాగా రవితేజ 'ఈగల్‌' మూవీతో పలకరించాడు. 


ఈ సినిమా ఇప్పటి వరకు సాధించిన వసూళ్ల విషయానికొస్తే.. తెలంగాణ + ఆంధ్రప్రదేశ్ కలిపి రూ. 14 కోట్ల షేర్ (రూ. 25 కోట్ల గ్రాస్) వసూళ్లను రాబట్టినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా రూ. 18 కోట్ల షేర్ (రూ. 36 కోట్ల గ్రాస్) వసూళ్లకు రాబట్టినట్టు తెలుస్తోంది.


ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 21 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. 22 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలో దిగిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర 3 కోట్ల వరకు రాబట్టాల్సి ఉంది.


ఇక రవితేజ నటించిన 'ఈగల్' మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికొస్తే.. 


తెలంగాణ (నైజాం).. రూ. 6 కోట్లు.. 
రాయలసీమ (సీడెడ్).. రూ. 2.5 కోట్లు.. 
ఆంధ్ర ప్రదేశ్.. రూ. 8.5 కోట్లు.. 
ఆంధ్ర ప్రదేశ్ + తెలంగాణ కలిపి .. రూ. 17 కోట్లు.. 
కర్ణాటక + రెస్ట్ ఆఫ్ భారత్ కలిపి రూ. 2 కోట్లు.. 
ఓవర్సీస్.. రూ. 2 కోట్లు.. 
ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ రూ. 21 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఈ మూవీ హిట్ అనిపించుకోవాలంటే .. బాక్సాఫీస్ దగ్గర రూ. 22 కోట్లు రాబడితే కానీ.. హిట్ అనిపించుకోదు. కానీ ఇప్పటికీ ఈ మూవీ రూ. 3 కోట్ల దూరంలో ఉండిపోయింది. 


'ఈగల్' మూవీ విషయానికొస్తే.. ఈ సినిమాలో హీరోగా రవితేజతో పాటు అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్, నవదీప్, శ్రీనివాస్ అవసరాల, మధుబాల ముఖ్యపాత్రల్లో నటించారు.ఈ సినిమాను కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. దాంతో పాటు రచన, ఎడిటింగ్  నిర్వహించారు. సంగీతం దావ్జాంద్ అందించారు. విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల భారీ ఎత్తున లావిష్‌గా నిర్మించారు.రవితేజ సినిమాల విషయానికొస్తే.. క్రాక్ తర్వాత మరోసారి గోపీచంద్ మలినేని దర్శకత్వంలో పవర్ఫుల్  సినిమా చేస్తున్నారు. దీనికి సంబంధించిన ప్రకటన విడుదల చేసారు. మైత్రీ మూవీ మేకర్స్ భారీ ఎత్తున నిర్మిస్తోంది. అటు హరీష్ శంకర్ దర్శకత్వంలో హిందీ రీమేక్ 'రెయిడ్' మూవీ చేస్తున్నారు. ఈ మూవీకి 'మిస్టర్ బచ్చన్' అనే టైటిల్ ఖరారు చేసారు. గతంలో వీళ్ల కాంబినేషన్‌లో షాక్, మిరపకాయ్ సినిమాలు వచ్చాయి. ఇపుడు రాబోతున్న 'మిస్టర్ బచ్చన్‌' మూవీ పై చిత్ర పరిశ్రమలో భారీ అంచనాలే ఉన్నాయి.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook