Tiger Nageswara Rao vs Bhagavanth Kesari : 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ దసరాకి నందమూరి బాలకృష్ణ భగవంత్ కేసరి అక్టోబర్ 19న విడుదల కాదా ఒకరోజు ఆలస్యంగా అనగా అక్టోబర్ 20న రవితేజ టైగర్ నాగేశ్వరరావు సినిమా విడుదలైంది. ఈ రెండు సినిమాలలో భగవంత్ కేసరి అందరినీ ఆకట్టుకుంటూ దాదాపు 70 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేయగా రవితేజ సినిమా మాత్రం బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది.


కాగా ఈ సందర్భంగా వీరిద్దరి మధ్య ఎన్నో సంవత్సరాలుగా సాగుతున్న బాక్స్ ఆఫీస్ సమరం ఇప్పుడు అందరి దృష్టిని ఆకట్టుకుంటుంది. అవును ఇది మొదటిసారి కాదు ఇప్పటికీ ఎన్నోసార్లు బాలకృష్ణ సినిమా అలానే రవితేజ సినిమా ఒకే టైంలో రిలీజ్ అయి బాక్సాఫీస్ దగ్గర పోటీపడ్డాయి.


వీరిద్దరి మధ్య పోటీ మొదలైన సంవత్సరం 2008. 2008 సంక్రాంతికి బాలయ్య ‘ఒక్కమగాడు’, రవితేజ ‘కృష్ణ’ రిలీజ్ కాగా.. వీటిలో బాలయ్య మూవీ డిజాస్టర్ అయింది. రవితేజ సినిమా కృష్ణా మాత్రం మంచి విజయం సాధించింది మ.ఇక ఆ తర్వాత 2011లో బాలకృష్ణ ‘పరమవీరచక్ర’ అలానే రవితేజ ‘మిరపకాయ్’ పోటీ పడ్డాయి. అప్పుడు కూడా రవితేజ సినిమా విజయం సాధించింది.



మధ్యలో మిత్రుడు, కిక్ కొంచెం గ్యాప్‌లో రిలీజైతే బాలయ్య సినిమా పరవాలేదు అనిపించుకోగా రవితేజ సినిమా మాత్రం సూపర్ హిట్ గా నిలిచింది. ఇక ఈ మధ్య విడుదలైన రవితేజ వాల్తేరు వీరయ్య అలానే బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమాలు రెండు కూడా మంచి విజయాన్ని సాధించాయి. అయితే వాల్తేరు వీరయ్య మెయిన్ హీరో చిరంజీవి కావడంతో అది రవితేజ సినిమాగా ఎవరు అనుకోలేదు.


దీంతో ఈసారి దసరాకి బాలయ్య, రవితేజల పోటీలో ఎవరు పైచేయి సాధిస్తారా అని అందరూ ఆసక్తిగా చూశారు. ఒకవేళ నిజంగానే మొదటి నుంచి వచ్చిన సెంటిమెంట్ వర్క్ అయితే ఈసారి కూడా రవితేజ సినిమా సూపర్ హిట్ సాధిస్తుందేమో అని అనుకున్నారు ఎంతోమంది. కానీ ఈసారి మాత్రం అందరి అభిప్రాయాలు తలకిందులు అయ్యాయి.



మంచి ఎమోషన్స్ అలానే ఆక్షన్ తో కూడిన సినిమాతో వచ్చి బాలకృష్ణ బాక్సాఫీస్ దగ్గర తన సత్తా చాటాడు. మరోపక్క రవితేజ మాత్రం ఫ్లాప్ సొంతం చేసుకున్నాడు.
రవితేజ టైగర్ నాగేశ్వరరావు సినిమా మొదటి షో నుంచి ఫ్లాప్ టాక్ సొంతం చేసుకోగా బాలకృష్ణ సినిమా మాత్రం పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది.



ఇక మొదటి రెండు రోజులు మాత్రం బాలకృష్ణ సినిమా కలెక్షన్స్ పరవాలేదు అనిపించుకోగా క్రమంగా ఈ కలెక్షన్స్ పెరిగి ఇప్పుడు సూపర్ హిట్ వైపు వెళుతున్నాయి. మరోపక్క రవితేజ సినిమా టైగర్ నాగేశ్వరరావు అలానే విజయ్ సినిమాలో మాత్రం ఫ్లాప్ వైపు వెళుతున్నాయి.


Also Read:  Kalyan Ram Devil : నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ ‘డెవిల్’లో బాలీవుడ్ సెన్సేషనల్ నటి


 


Also Read: Karampudi Man Death News: కన్నీళ్లు పెట్టిస్తున్న ఘటన.. భార్య బిడ్డకు జన్మనిచ్చిన ఆసుపత్రికే భర్త మృతదేహం



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.TwitterFacebook