Ravi Teja: మాస్ మహారాజ్ రవితేజ రీసెంట్ గా.. ‘మిస్టర్ బచ్చన్’ సినిమాతో పలకరించారు. ఈ సినిమాకు నెగిటివ్ టాక్ తో బాక్సాఫీస్ దగ్గర బొక్కబోర్లా పడింది. ఈ సినిమా హిందీలో అజయ్ దేవగణ్ హీరోగా నటించి హిట్టైన ‘రెయిడ్’ మూవీకి రీమేక్ గా తెరకెక్కింది. ఈ సినిమాను తెలుగు నేటివిటీకి తగ్గట్టు తెరకెక్కించడంలో దర్శకుడు హరీష్ శంకర్ విఫలమయ్యాడు. ఆ సంగతి పక్కన పెడితే.. మాస్ మహారాజ్ రవితేజకు షూటింగ్ లో భాగంగా కొన్ని స్టంట్స్ చేస్తుండగా.. కుడి చేతికి స్వల్ప గాయమైంది. ఆ తర్వాత చికిత్స కోసం హాస్పిటల్ కు వెళితే.. ఈయన కుడి చేతికి డాక్టర్లు శస్త్ర చికిత్స చేసారు. అంతేకాదు దాదాపు నెలన్నర పాటు రవితేజ విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించినట్టు సమాచారం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

#RT75 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ సినిమాతో భాను భోగవరపు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ధమాకా తర్వాత శ్రీలీల కథానాయికగా నటిస్తోంది. యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. షూటింగ్ లో రవితేజ గాయపడిన విషయం తెలుసుకొని ఆయన త్వరగా కోలుకోవాలని ఫ్యాన్స్ ప్రార్థిస్తున్నారు.


రవితేజ హీరోగా నటించిన ‘మిస్టర్ బచ్చన్’ సినిమా విషయానికొస్తే.. ఈ సినిమా హీరోగా రవితేజకు 74వ చిత్రం. ఈ సినిమాతో భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా పరిచయమైంది. ఈ సినిమా  1980లో ప్రముఖ ఇన్ కంటాక్స్ ఆఫీసర్ సర్ధార్ ఇందర్ సింగ్ జీవిత కథ నేపథ్యంలో బాలీవుడ్ దర్శకుడు  రాజ్ కుమార్ గుప్తా తెరకెక్కించారు. అయితే నార్త్ ప్రేక్షకుల మెప్పు పొందిన ఈ చిత్రాన్ని సౌత్ ప్రేక్షకులు ఆదరించలేదు.  
ఈ సినిమా ఇప్పటి వరకు దాదాపు రూ. 8 కోట్ల వరకు రాబట్టింది. మొత్తంగా ఈ సినిమా రూ. 32 కోట్ల బ్రేక్ ఈవెన్ తో బరిలో దిగిన ఈ సినిమా ఇప్పటి వరకు రూ. 8 కోట్ల షేర్ మాత్రమే రాబట్టింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ పూర్తి కావాలంటే ఇంకా రూ. 24 కోట్ల షేర్ రాబట్టాలి. ఇపుతున్న  పరిస్థితుల్లో ఈ సినిమా కోలుకోవడం కష్టమే అని చెప్పాలి.


ఇదీ చదవండి: ఒకే టైటిల్ తో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ చిరు చేసిన ఈ సినిమాలు తెలుసా..


ఇదీ చదవండి: ఒకే రోజు విడుదలైన చిరు, కమల్ హాసన్ సినిమాలు.. దర్శకుడు కూడా ఒకడే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి