Khiladi Movie Teaser | ఏ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా కష్టపడి ఎదిగి, తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నాడు టాలీవుడ్‌ నటుడు రవితేజ. రమేష్ వర్మ దర్శకత్వంలో రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఖిలాడి. ఇటీవల మాస్ మహారాజా రవితేజ పుట్టినరోజును సందర్భంగా ఖిలాడి మూవీ ఫస్ట్ గ్లింప్స్‌ వీడియోను అందించారు. ఆ వీడియోకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అనిల్ రావిపూడి దర్శకత్వంలో క్రాక్ మూవీతో సంక్రాంతి బరిలోకి దిగి విజయాన్ని అందుకున్నాడు రవితేజ. తాజాగా ఉగాది సందర్భంగా ఖిలాడి మూవీ టీజర్‌ను ప్రేక్షకులకు సినిమా యూనిట్ అందించింది. టీజర్ వీక్షిస్తే.. క్రైమ్ థ్రిల్లర్ జానర్‌లో మూవీని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. రవితేజ(Actor Ravi Teja) చాలా మాస్ అండ్ వయోలెంట్ పాత్రలో కనిపిస్తున్నాడు. అమ్మాయిని మెడలో తాడు బిగించి గట్టిగా లాగుతూ తలపై సుత్తితో కొట్టడం దాని వెనుక బలమైన కారణం ఉందని ఆలోచింపచేస్తుంది. ఖిలాడి మూవీలో సీనియర్ నటుడు, యాక్షన్ కింగ్ అర్జున్ కీలక పాత్ర పోషించాడు.  


Also Read: వకీల్ సాబ్ మూవీ రివ్యూ, రేటింగ్, ప్లస్ పాయింట్స్, మైనస్ పాయింట్స్



ఖిలాడీ టీజర్‌లో చివర్లో రవితేజ చెప్పే మాస్ డైలాగ్ వీక్షకులను ఆకట్టుకుంటోంది. ‘ఇఫ్ యూ ప్లే స్మార్ట్ వితౌట్ స్టుపిడ్ ఎమోషన్స్, యూ వర్ అన్‌స్టాపబుల్’ అంటూ టీజర్ వీడియో ముగించారు. ఈ టాలీవుడ్(Tollywood) సినిమాలో రవితేజ సరసన డింపుల్ హయతి, మీనాక్షి చౌదరిలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. జబర్దస్త్ యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ ఓ ఆసక్తికరమైన పాత్ర పోషించినట్లు సమాచారం. దేవిశ్రీ ప్రసాద్ సమకూర్చిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు ప్లాస్ పాయింట్ కానుంది. రవితేజను టీజర్‌లో చూసిన ప్రేక్షకులు ఇంతకీ రవితేజ డబుల్ రోల్ పోషించాడా ఏంటి అనే టాక్ మొదలైంది.


Also Read: Vakeel Saab Songs: ఒక్క క్లిక్‌తో పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సాంగ్స్ జూక్ బాక్స్ 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook