Mr Bachchan OTT Release: మాస్ మహారాజా రవితేజ, టాలెంటెడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్లో షాక్, మిరపకాయ్ వంటి సినిమాల తరువాత మూడవ సినిమాగా విడుదలైన చిత్రం మిస్టర్ బచ్చన్. హిందీలో అజయ్ దేవగన్ నటించి సూపర్ హిట్ అయిన రైడ్ సినిమాకి తెలుగు రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కింది. భాగ్యశ్రీ బోర్సే ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ గా పరిచయం అయింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాని నిర్మించారు. ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ సినిమా విడుదలైంది. విడుదలకు ముందు వరకు టీజర్, ట్రైలర్, పాటలు కూడా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి. అయితే విడుదలైన తర్వాత మాత్రం ఈ సినిమాకి.. మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. కమర్షియల్ గా ఈ సినిమా సక్సెస్ కాలేకపోయింది. జగపతిబాబు ముఖ్య విలన్ గా నటించిన ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ ప్లాట్ఫార్మ్ లో విడుదల కి సిద్ధం అయింది.


డిజిటల్ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ మిస్టర్ బచ్చన్ స్ట్రీమింగ్ రైట్స్ ను కొనుగోలు చేశారు. ఈ సినిమా అతి త్వరలో నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కి సిద్ధం అవుతుంది. సెప్టెంబర్ 12 నుంచి ఈ సినిమా తెలుగు తమిళ్ మలయాళం కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కి అందుబాటులో ఉంటుంది అని నెట్ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది. ఇదే విషయాన్ని ధ్రువీకరిస్తూ సినిమాలో ఫాన్స్ కి చాలా బాగా నచ్చేసిన సంపదను కాపాడే సైనికుడు అనే డైలాగ్ ని కూడా రాసి అందరి దృష్టిని ఆకర్షించారు. 


సినిమా కథ విషయానికి వస్తే,  ఇన్‌కం ట్యాక్స్ డిపార్ట్మెంట్‌లో ఆనంద్ బచ్చన్ (రవితేజ) ప‌ని చేస్తుంటాడు. ప‌లుకుబ‌డి ఉన్న ఓ వ్య‌క్తి ఇంట్లో రైడ్ చేసి న‌ల్ల‌ధ‌నాన్ని ప‌ట్టుకుంటాడు కానీ ఉద్యోగం కోల్పోతాడు. సొంతూరు వ‌చ్చిన బచ్చన్ జిక్కితో(భాగ్యశ్రీ బోర్సే) ప్రేమలో పడతాడు. వీరిద్ద‌రి పెళ్లికి ముందు మళ్ళీ ఉద్యోగం తిరిగి వస్తుంది. ఎంపీ ముత్యం జ‌గ్గ‌య్య (జగపతి బాబు) ఇంట్లో రైడ్ చేయ‌మ‌ని అత‌డికి ఆదేశాలు వ‌స్తాయి. రైడ్ లో బచ్చన్ ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు ? అక్కడ నల్లధనం దొరికిందా లేదా? చివరకి ఏమైంది తెలియాలంటే సినిమాను చూడాల్సిందే.


Also Read: Virat Kohli: భారత్‌కు దూరంగా కోహ్లీ, అనుష్క.. బ్రిటన్‌లో సెటిల్ అయ్యేందుకు ప్లాన్..! 


Also Read: Traffic Restrictions: ఖైరతాబాద్‌ వెళ్లే వాహనదారులకు బిగ్‌ అలెర్ట్‌.. వినాయక చవితి సందర్భంగా ఈ రూట్లలో ట్రాఫిక్‌ మళ్లింపులు.. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.