Mr Bachchan OTT Streaming: మాస్ మహారాజ్ రవితేజకు కాలం కలిసి రావడంతో ఏ దర్శకుడితో సినిమా చేసినా బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితం రావడం లేదనే చెప్పాలి. ‘ధమాకా” తర్వాత రవితేజ ఖాతాలో హిట్ అనేదే లేదు. వరుస పెట్టి సినిమాలు ఫ్లాప్ అవుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో గతంలో తనకు ‘మిరపకాయ్’ వంటి భారీ హిట్ అందించిన హరీష్ శంర్ దర్శకత్వంలో ‘మిస్టర్ బచ్చన్’ మూవీ చేసాడు. హిందీలో హిట్టైన ‘రెయిడ్’ మూవీకి రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైంది. హిందీలో అజయ్ దేవ్ గణ్ హీరోగా నటించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అనుభవ్ సిన్హా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా భాఈర హిట్ ను నమోదు చేసింది. ఇక హరీష్ శంకర్ కు రీమేక్ ను డీల్ చేయడంలో మంచి ఎక్స్ పర్ట్. కానీ మిస్టర్ బచ్చన్ తెలుగులో రీమేక్ చేయడంలో పూర్తిగా విఫలమయ్యాడు. అప్పట్లో 'దబాంగ్' మూవీని గబ్బర్ సింగ్ గా ఏ రేంజ్ లో తెలుగు ప్రేక్షకులను మెప్పించాడో తెలిసిందే కదా. అటు జిగర్తాండ మూవీని తెలుగులో 'గద్దలకొంగ గణేష్' తెరకెక్కించి రీమేక్ ల విషయంలో తాను తోపన్న విషయాన్ని ప్రూవ్ చేసుకున్నాడు. కానీ 'మిస్టర్ బచ్చన్' విషయంలో ఆ అంచనాలను అందుకోవడంతో విఫలమయ్యాడు. దర్శకుడు హరీష్ శంకర్ 90ల కాలం నాటి నేపథ్యంలో తెరకెక్కించాడు. మొత్తంగా హిందీ పాటలతో ఏదో అంత్యాక్షరి ఎపిసోడ్ లా ఈ సినిమాను చుట్టేసాడు. హీరో ఫాదర్ అమితాబ్ ఫ్యాన్ కాబట్టి.. హీరోకు మిస్టర్ బచ్చన్ పేరు పెడతాడు.


హిందీలో చివరి కంటూ క్యారీ అయిన ఎమోషన్ తెలుగులో కామెడీ అయిపోయింది. మొత్తంగా ప్రేక్షకుల ఛీత్కారానికి గురైన ఈ సినిమా ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కు వచ్చేసింది. మొత్తంగా థియేట్రికల్ ఈ సినిమా చూడని వాళ్లు ఇపుడు ఓటీటీ వేదికగా ఈ సినిమాను చూడొచ్చు. థియోట్రికల్ ఫ్లాపైన ఈ చిత్రం ఓటీటీ వేదికగా ఏ మేరకు హిట్ అందుకుంటుందో చూడాలి.


ఇదీ చదవండి:  పవన్ కళ్యాణ్ మూడో భార్య అన్నా లెజ్నెవా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తెలుసా..!


ఇదీ చదవండి:  పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకోవడానికి కారణమేమిటంటే..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.