Eagle Release date Announced: మాస్‌ మహారాజా రవితేజ (Ravi Teja) నటిస్తున్న చిత్రాల్లో ఈగల్‌ (Eagle) ఒకటి. సినిమాటోగ్రాఫర్‌ కమ్‌ డైరెక్టర్‌ కార్తీక్‌ ఘట్టమనేని (Karthik Ghattamaneni) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ లీడ్ రోల్ లో నటిస్తోంది. ఇందులో కావ్య థాపర్ మరో కీ రోల్ లో నటిస్తుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తాజాగా ఈ మూవీ నుంచి ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ను ప్రకటించారు మేకర్స్. ఈగల్ చిత్రాన్ని సంక్రాంతి పండుగ కానుకగా 2024 జనవరి 13న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు మేకర్స్. దీనికి సంబంధించిన పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. ఇందులో మంటలు చెలరేగుతున్న ఓ ఇంటి ముందు తుపాకీ పట్టుకున్న రవితేజ స్టిల్‌ గూస్‌ బంప్స్ తెప్పించేలా ఉంది. మొండోడు పండగ తీసుకుని పదమూడున వస్తున్నాడు.. అంటూ లాంఛ్ చేసిన లుక్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఈగల్‌లో నవదీప్‌, శ్రీనివాస్ అవసరాల, మధుబాల  తదితరులు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్నారు. 


మరోవైపు రవితేజ టైగర్‌ నాగేశ్వరరావు చిత్రంలో నటిస్తున్నాడు. ఇది పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోంది. 1970 దశకంలో స్టూవర్ట్‌పురంలో పాపులర్‌ దొంగగా పేరుగాంచిన టైగర్ నాగేశ్వర్రావు జీవిత కథ ఆధారంగా ఈ మూవీ రూపొందుతుంది. ఈ చిత్రానికి  డెబ్యూ డైరెక్టర్ వంశీ (Vamsee) దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీలో రవితేజకు జోడిగా కృతిసనన్ సోదరి నుపుర్ సనన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇందులో గాయత్రి భరద్వాజ్‌ హీరోయిన్ గా నటిస్తోంది. చాలా ఏళ్ల తర్వాత సీనియర్‌ నటి రేణూదేశాయ్‌ హేమలత లవణం పాత్ర ద్వారా రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు.  ఈ చిత్రాన్ని అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని అక్టోబర్ 20న తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నారు. 



Also Read: Maama Mascheendra Trailer: మూడు గెటప్పుల్లో సుధీర్ బాబు.. ఆసక్తికరంగా 'మామా మశ్చీంద్ర' ట్రైలర్..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook