Ravanasura Glimpse : మాస్ రాజా ఫాన్స్ కు ట్రీట్ ఇచ్చేశారు.. రావాణాసుర గ్లింప్స్ చూశారా?
Ravanasura Movie Glimpse: మాస్ మహా రాజ బర్త్ డే సంధర్భంగా ఆయన హీరోగా నటిస్తున్న రావణాసుర మూవీ నుంచి ఒక గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఆ వివరాలోకి వెళితే
Ravanasura Movie Glimpse: మాస్ మహారాజా రవితేజ వరుస సినిమాలతో మంచి జోరు మీద ఉన్నాడు, ఇప్పటికే ధమాకా సినిమాతో 100 కోట్ల కలెక్షన్లు సాధించిన ఆయన వాల్తేరు వీరయ్యలో కూడా భాగమై ఆ విజయాన్ని కూడా పంచుకున్నారు. ఇక ప్రస్తుతం రవితేజ హీరోగా రావణాసుర అనే సినిమా చేస్తున్నారు. సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా మీద అందరిలోనూ భార్య అంచనాలు ఉన్నాయి. రవితేజ క్రాక్ లాంటి భారీ హిట్ అందుకున్న వెంటనే ఈ సినిమా అనౌన్స్ చేయడం ఆ తర్వాత సుధీర్ వర్మకు ఉన్న ట్రాక్ రికార్డు వంటివి చూసి అందరిలోనూ ఈ సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
ఇక ఈ సినిమాలో రవితేజ సరసన ఏకంగా ఐదుగురు హీరోయిన్ల నటిస్తున్నారని విషయం కూడా బయటికి రావడంతో సినిమా ఎలా ఉంటుందా అని అందరూ ఆసక్తి చూపిస్తున్నారు. ఇక తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఒక అప్డేట్ వచ్చేసింది. ఈరోజు రవితేజ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ అయితే విడుదల చేశారు. ఇక ఈ సినిమాలో టైటిల్ కి తగ్గట్టుగానే ఒక నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో రవితేజ కనిపిస్తున్నట్లు మేకర్స్ అయితే గ్లింప్స్ రిలీజ్ చేశారు.
అయితే ఈ గ్లింప్స్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగిందనే చెప్పాలి. రవితేజ పుట్టినరోజు కావడంతో ఆయన ఫ్యాన్స్ అంతా ఈ గ్లింప్స్ చూసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో చూపిస్తున్న క్రైమ్ సీన్స్, అలాగే రవితేజ స్క్రీన్ ప్రజన్స్ సహా మొత్తం ప్రేక్షకులను ఎంగేజ్ చేయగలవు అని చెబుతున్నారు.
ఈ సినిమాలో ఫరియా అబ్దుల్లా, మేఘా ఆకాష్, పూజిత పొన్నాడ, అను ఇమ్మానియేల్, దక్ష నగార్కర్ వంటి వారు నటిస్తున్నారు. కథ, స్క్రీన్ ప్లే డైలాగ్స్ శ్రీకాంత్ విస్సా అందిస్తుండగా సుధీర్ వర్మ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సినిమాని రవితేజ తన రవితేజ టీం వర్క్స్ బ్యానర్ తో పాటుగా అభిషేక్ నామ అభిషేక్ పిక్చర్ సంస్థతో కలిసి సహా నిర్మిస్తున్నాడు. చూడాలి మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎలా అలరించబోతోంది అనేది.
Also Read: Veera Simha Reddy 2 Weeks: దారుణంగా పడిపోయిన వీరసింహారెడ్డి వసూళ్లు.. మొత్తంగా లాభం ఎంతంటే?
Also Read: VSR vs WV Collections: 'వీర సింహ' వెనక్కు తగ్గినా నేను తగ్గనంటున్న వీరయ్య
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook