Veera Simha Reddy 2 Weeks: దారుణంగా పడిపోయిన వీరసింహారెడ్డి వసూళ్లు.. మొత్తంగా లాభం ఎంతంటే?

Veera Simha Reddy 2 Weeks Collections: నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన వీర సింహారెడ్డి సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాగా ఇప్పుడు ఆ సినిమా ఎంత వసూలు చేసింది అనేది చూద్దాం.   

Written by - Chaganti Bhargav | Last Updated : Jan 26, 2023, 10:57 AM IST
Veera Simha Reddy 2 Weeks: దారుణంగా పడిపోయిన వీరసింహారెడ్డి వసూళ్లు.. మొత్తంగా లాభం ఎంతంటే?

Veera Simha Reddy 2 Weeks Collections: నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన వీర సింహారెడ్డి సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా విడుదలయి రెండు వారాలు పూర్తయ్యాయి. అంటే సుమారుగా 14 రోజుల థియేట్రికల్ రన్ పూర్తి చేసుకున్న ఈ సినిమా కలెక్షన్లు ఎలా ఉన్నాయి అనే విషయాన్ని పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ముందుగా మొదటి రోజు పాతిక కోట్ల పైగా కలెక్షన్లు రాబట్టిన ఈ సినిమా రెండో రోజు నుంచి 10 కోట్ల లోపే కలెక్షన్లు రాబట్టింది.

సుమారు 8 రోజులపాటు కోటికి పైగా కలెక్షన్లు రాబట్టినా 9వ రోజు నుంచి కోటి లోపు కలెక్షన్లకు పడిపోయింది. ఇక మళ్లీ 11వ రోజు కోటి 44 లక్షలు వసూలు చేసినా 14వ రోజు పఠాన్ సినిమా ఎంట్రీతో దారుణంగా వసూళ్లు డ్రాప్ అయ్యాయి. ఈ సినిమా తెలుగు రాష్ట్రాలలో కేవలం ఎనిమిది లక్షలు మాత్రమే 14వ రోజు వసూలు చేసింది. మొత్తంగా చూసుకుంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 14 రోజులకు గాను 64 కోట్ల 90 లక్షల షేర్, 105 కోట్ల ఐదు లక్షల గ్రాస్ వసూళ్లు రాబట్టింది ఈ సినిమా ఇక 14 రోజులకు గాను నాలుగు కోట్ల 77 లక్షలు వసూళ్లు కర్ణాటక సహా మిగతా భారత దేశంలో రాబడితే ఓవర్సీస్ లో ఐదు కోట్ల 73 లక్షల రాబట్టి ప్రపంచవ్యాప్తంగా 75 కోట్ల 45 లక్షల షేర్, 126 కోట్ల 80 లక్షల వసూలు చేసింది.

ఇక 73 కోట్లకు ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ జరగడంతో 74 కోట్లకి బ్రేక్ ఈవెన్ టార్గెట్ గా నిర్ణయించారు. ఇక ఇప్పటికే ఆ టార్గెట్ పూర్తి చేసిన ఈ సినిమా కోటి 40 లక్షల ప్రాఫిట్ లోకి వెళ్లింది. పఠాన్ సినిమా ఎంట్రీ తో వసూళ్లలో డ్రాప్ కనిపించడంతో ఇక మీదట కూడా అవి కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈరోజు హంట్ మూవీ తో సుధీర్ బాబు ప్రేక్షకులు ముందుకు రావడంతో ఈ వీర సింహారెడ్డి థియేటర్ల మీద కూడా ఆ ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది.

Also Read: Malikappuram Movie Review: మాలికాపురం మూవీ ఎలా ఉందంటే?  

Also Read: Balakrishna Controversy:మాకేం వివాదం అనిపించలేదు.. ఇక లాగకండి.. ఎస్వీ రంగారావు మనవళ్లు వీడియో రిలీజ్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

 
 

Trending News