Ravikula Raghu Rama: గీతా గోవిందం సినిమాతో సూపర్ సక్సెస్ సాధించిన దర్శకుడు ప్రస్తుతం మరోసారి విజయ్ దేవరకొండ తో ఫామిలీ స్టార్ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం ఏప్రిల్ 5న విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్పటిక ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్ అలానే ఒక మెలోడీ సాంగ్ సూపర్ సక్సెస్ సాధించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ నేపథ్యంలో తాజాగా ఈ దర్శకుడు మరో సినిమాకి తన సపోర్ట్ అందిస్తూ.. ఒక మెలోడీ నా సాంగ్ విడుదల చేశాడు.



పాజిటివ్ వైబ్ ప్రొడక్షన్ బ్యానర్ తెరకెక్కుతున్న లవ్ అండ్ రొమాంటిక్ సినిమా 'రవికుల రఘురామ'. ఈ చిత్రం లో యువ హీరో గౌతమ్ సాగి, అందాల భామ దీప్శిఖా జంటగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి శ్రీధర్ వర్మ నిర్మాణ బాధ్యతలు తీసుకుంటుండగా.. ట్యాలెంటెడ్ డైరెక్టర్ చంద్రశేఖర్ కానూరి దర్శకత్వం వహిస్తున్నారు.  


మంచి వినోదాన్ని అందించే ఈ సినిమా 
ని ఎంతో క్వాలిటీగా నిర్మాణ ఖర్చుకి వెనకాడకుండా ఇస్తున్నారు ఈ చిత్ర నిర్మాత. మరోవైపు దర్శకుడు చంద్రశేఖర్ తన సృజనాత్మకత మొత్తం జోడించి ఈ కథకి ప్రాణం పోస్తున్నారు. అలాగే ఈ సినిమాలో హీరో హీరోయిన్స్ ప్రేమ కథ అలానే వారి పెర్ఫార్మెన్స్ హైలెట్ గా నిరుస్తుంది అని వినికిడి. కాగా ఈ చిత్రానికి ముఖ్యంగా పాటలు హైలెట్ గా నిలవనున్నాయట.


ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా పనిచేస్తున్న సుకుమార్ పమ్మి అద్భుతమైన పాటలు అందిస్తున్నారు. తన సంగీతాం ఈ చిత్రానికి ఒక సోల్ గా నిలవనుండి అని ఈ చిత్రం నిర్మాత నమ్మకం వ్యక్తం చేశారు. తాజాగా ఈ చిత్రం నుంచి 'చందమామే' అనే బ్యూటిఫుల్ మెలోడీ సాంగ్ రిలీజ్ అయింది. ఈ లిరికల్ వీడియో ని క్రేజీ డైరెక్టర్ పరశురామ్ లాంచ్ చేయడం విశేషం.


 



డైరెక్టర్ పరశురామ్ ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ని అభినందించారు. చందమామే సాంగ్ వింటుంటే చాలా ప్రామిసింగ్ గా.. కానీ ఎంతో మెలోడీస్ గా అనిపిస్తోంది. లిరిక్స్, ట్యూన్ ఎంతో అందంగా వినసొంపుగా ఉండడంతో ఈ సాంగ్ యూట్యూబ్ లో సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ పాట ఆకట్టుకోవడమే కాదు సినిమాపై కూడా ఆసక్తిని పెంచేలా ఉంది. 


Read More: Vijay Devarakonda - Family Star: విజయ్ దేవరకొండ 'ఫ్యామిలీ స్టార్' మూవీ ఫస్ట్ సింగిల్‌కు సూపర్ రెస్పాన్స్..


Read More: Praveen IPS: విడుదలైన ప్రవీణ్ ఐపిఎస్ ట్రైలర్.. ఫిబ్రవరి 16న థియేటర్స్ లో సందడి చేయనున్న సినిమా..


 



 


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook