Praveen IPS: విడుదలైన ప్రవీణ్ ఐపిఎస్ ట్రైలర్.. ఫిబ్రవరి 16న థియేటర్స్ లో సందడి చేయనున్న సినిమా..

Praveen IPS Trailer : పోలీస్ సినిమాలు ఎప్పుడు తెలుగు ప్రేక్షకులను ఎక్కువగా ఆకట్టుకుంటూ ఉంటాయి. ఇదే రూట్ ఫాలో అవుతూ ప్రవీణ్ ఐపీఎస్ అనే సినిమా మరోసారి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి రాబోతోంది.. ఈ సందర్భంగా ఈ సినిమా ట్రైలర్ ని విడుదల చేశారు ఈ చిత్ర మేకర్స్..

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 11, 2024, 04:37 PM IST
Praveen IPS: విడుదలైన ప్రవీణ్ ఐపిఎస్ ట్రైలర్.. ఫిబ్రవరి 16న థియేటర్స్ లో సందడి చేయనున్న సినిమా..

Praveen IPS Release Date: కథ బాగుంటే చిన్న సినిమాలు అయినా తెలుగు ప్రేక్షకులు ప్రస్తుతం బాగా ఆదరించి మంచి కలెక్షన్స్ అందిస్తున్నారు. ఈ థియరీ నే నమ్ముకొని ప్రస్తుతం రాబోతున్న సినిమా ప్రవీణ్ ఐపిఎస్. ఐరా ఇన్ఫోటైన్ మెంట్ బ్యానర్పై మామిడాల నీల ప్రొడ్యూసర్గా నిర్మితమైన ప్రవీణ్ IPS ఈ నెల 16న రిలీజ్ కానుంది. విడుదల తేదీ దగ్గర పడుతూ ఉండటంతో ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ రామానాయుడు స్టూడియోలో జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ప్రవీణ్ IPS ట్రైలర్ ను సీనియర్ దర్శకులు సి.ఉమామహేశ్వరరావు, ప్రొడ్యూసర్ వివేక్ కూచిబొట్ల విడుదల చేశారు.

ఈ సందర్భంగా సి. ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ... ప్రవీణ్ IPS సినిమా ప్రేక్షకుల హృదయాలను కదిలిస్తుందని అన్నారు. చాలామంది ఆదర్శాల కోసం సినిమాలు తీస్తే వాటిని జనం ఆదరించరని ఒక తప్పుడు అభిప్రాయం ఉందని ‘మాల పిల్ల’, ‘రైతుబిడ్డ’ వంటి సినిమాల్లో ఆదర్శమే చూపించారని, ఆదర్శం (ఐడియలిజం) అనేది జన హృదయాలను తాకుతుందని తెలియజేశారు.

హీరో నంద కిషోర్ మాట్లాడుతూ... ప్రవీణ్ IPSలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి రోల్ పోషించడం అదృష్టమని చెప్పుకొచ్చారు. తనకు ఈ అవకాశం వివేక్ కూచిభొట్ల గారి వల్ల వచ్చిందని గుర్తు చేశారు. ఆర్ఎస్పీ గారు మానవత్వం ఉన్నవారని, ఆ మానవత్వం వల్లనే ఆయన ఎంతో మందికి సాయం చేశారని, ఆ సంకల్పం చాలా గొప్పదని, ఆయన ఎంతో మందికి ఆదర్శమని అన్నారు. 

పిల్లా జమీందర్ ఫేమ్ ప్రొడ్యూసర్ డీఎస్ రావు మాట్లాడుతూ ప్రవీణ్ IPS సినిమాల్లో పొలిటికల్ అంశాలున్నట్లు ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతుందని, సినిమా రిలీజ్ అయ్యాక సంచలనం సృష్టిస్తుందని అనిపిస్తుందని అన్నారు. ఎలక్షన్ పీరియడ్లో ప్రవీణ్ IPS రిలీజ్ అవుతుందని , పెద్ద సక్సెస్ అవుతుందని అభిప్రాయపడ్డారు. నటీనటులు, డైరెక్టర్లకు మంచి పేరొస్తుందని అన్నారు.

హీరోయిన్ రోజా మాట్లాడుతూ... ఆర్ఎస్పీగారిలా ఉండాలని ఆయన గురించి తెలుసుకున్నాక అర్థమైందని అన్నారు. విద్యాప్రాముఖ్యతను ఈ సినిమాలు చూపించారని, చిన్న పిల్లలకు ఈ సినిమాను చూపించాల్సిన అవసరముందని ఆమె చెప్పారు. మూవీని చాలా తక్కువ రోజుల్లో కంప్లీట్ చేశామన్నారు.

డాక్టర్ అరుణ మాట్లాడుతూ... డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గురించి పదేళ్ల క్రితం విన్నానని గుర్తు చేశారు. ఎవరన్నా చదువుకోవడం కష్టమనిపించే విద్యార్థులకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి స్పీచ్లు చూడాలని సలహా ఇస్తానని చెప్పారు. ప్రవీణ్ IPS మూవీ ట్రైలర్ చూస్తుంటే ప్రవీణ్ గారి ఎన్ని కష్టాలు అనుభవించారోనని, ఈ రోజుల్లోనూ వివక్ష ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుందని, సినిమా బాగుంటుందని భావిస్తున్నట్లు చెప్పిన ఆమె పిల్లలకు ఈ సినిమాను చూపిస్తే ఇన్స్పిరేషన్ గా తీసుకుంటారని చెప్పారు.

డైరెక్టర్ దుర్గా దేవ్ నాయుడు మాట్లాడుతూ... ప్రవీణ్ IPS మూవీ తనకు డెబ్యూ ఫిల్మ్ అని, ఛాన్స్ ఇచ్చిన మామిడాల నీల గారికి ధన్యవాదాలు తెలిపారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి జీవితాన్ని మూడు పార్టులుగా మూడు సినిమాలు తీయాలి. కానీ తాము సెలెక్టివ్ అంశాలను తీసుకొని ప్రవీణ్ IPS మూవీ తీశామని తెలియజేశారు. తనకు అన్ని విషయాల్లో అండగా నిలిచిన వివేక్గారికి ధన్యవాదాలు తెలిపారు. ప్రవీణ్ IPS మూవీకి పని చేసిన టెక్నిషీయన్లు, ఆర్టిస్టులు బాగా సహకరించాని, హీరో నంద కిషోర్ గారు ఒక స్టూడెంట్లా మారి సహకరించారని గుర్తు చేశారు.

Also Read: Transgender: అవమానాలనే మెట్లుగా చేసుకుని ఎదిగిన ట్రాన్స్‌జెండర్‌.. ఈ కథ స్ఫూర్తిదాయకం

Also Read: Bir Billing Dog Loyal: కన్నీటి గాథ.. యజమాని బాడీ వద్ద 48 గంటలు కాపలా కాసిన పెంపుడు కుక్క

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News