Razakar Director Yata Satyanarayana: రజకార్ మూవలో బాబీ సింహా, వేదిక, అనుష్క త్రిపాఠి, అనసూయ, ఇంద్రజ, మకరంద్ దేశ్‌పాండే ముఖ్యపాత్రల్లో నటించారు. సమీర్ వీర్ క్రియేషన్స్ బ్యానర్ పై  యాటా స‌త్య‌నారాయ‌ణ ద‌ర్శ‌క‌త్వం వహించారు. గూడూరు నారాయ‌ణ రెడ్డి నిర్మించారు.  మార్చి 15న ఈ చిత్రాన్ని దక్షిణాది భాషలైన తెలుగు, తమిళ, కన్నడ, మలయాళంతో పాటు మరాఠీ, హిందీ భాషల్లోనూ సినిమాను ప్యాన్ ఇండియా లెవల్లో విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు.  ఈ సినిమాను చరిత్ర ఆధారంగా తెరకెక్కించాను. మన జీవిత చరిత్రను ఉన్నది ఉన్నట్టుగా తీశాం. అలాంటి సినిమాకు, అలాంటి చరిత్రకు రేటింగ్ ఇవ్వడం కరెక్ట్ కాదనిపించింది. అందుకే రేటింగ్స్ ఇవ్వొద్దు అన్నాను. సినిమా నచ్చలేదని, దర్శకుడు బాగా చేయలేదని విమర్శించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

-చిన్నతనం నుంచీ నాకు సినిమాలంటే అదే పిచ్చి అభిమానం. పైగా మన చరిత్రను చెప్పాలని కోరిక నాలో బలంగా ఉండేది. నాకు ఈ నిర్మాతతో పదేళ్ల నుంచి పరిచయం ఉంది. కానీ ఆయనకు సినిమాల్లోకి రావాలనే కోరిక లేదు. కానీ కొన్నేళ్లకు ఓ మంచి సినిమా తీయాలని, చరిత్రలో నిలిచిపోవాలనే సినిమా తీయాలని ఆయన అన్నారు. రజాకార్ సినిమా చేద్దామన్నాను.  ఆయన కూడా సరే అన్నారు. బడ్జెట్ సరిపోదేమో అనుకున్నాను. కానీ ఆయనే పట్టుబట్టి ఆయనే ఈ సినిమాను నిర్మించారు.  అలా రజాకార్ మొదలైంది.


మా నిర్మాత ఓ పొలిటికల్ లీడర్.. కాబట్టి కొందరు కాంట్రవర్సీ చేస్తున్నారేమో. కానీ నేను ఓ క్రియేటర్‌గా అలా ఆలోచించడం లేదు. చరిత్రను ఉన్నది ఉన్నట్టు చూపించాను. మన చరిత్ర చెప్పాలనుకున్నాను.. తెరపైకి తీసుకొచ్చాను. రేపు  సినిమా విడుదలయ్యాకా  అది కాంట్రవర్సీ కాదని అందరికీ అర్థం అవుతుంది.


మా భూమి లాంటి గొప్ప కథను వెండితెరపై ఆవిష్కరించారు.  మళ్లీ ఇప్పుడు అలాంటి మరో గొప్ప కథను చెప్పే అదృష్టం నాకు వచ్చిందని భావిస్తున్నాను. ఆర్కా మీడియాలో ఎన్నో ప్రేమ కథలు పట్టుకుని తిరిగాను. హారర్ కథలు కూడా రెడీ చేశాను. కానీ అన్నీ మధ్యలో ఆగిపోయాయి. కానీ ఇలా రజాకార్ నాకు రావడం ఆనందంగా, అదృష్టంగా భావిస్తున్నాను.


సెన్సార్ నుంచి ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయలేదు.  ఓ 16 పాయింట్లు అడిగారు. వాటికి అన్ని ఫ్రూప్స్ చూపించాను. కొన్ని మితి మీరిన వయలెన్స్ సీన్లు ఉన్నాయని కొన్నింటికి కట్స్ చెప్పారు. పోస్టర్ రిలీజ్ చేసినప్పుడు ఎన్నికల హడావిడి వచ్చింది. కానీ అప్పటికీ షూటింగ్ పూర్తి కాలేదు. టీజర్ రిలీజ్ చేసినప్పుడు కూడా షూటింగ్ పూర్తి కాలేదు. గ్రాఫిక్స్  వర్క్ వల్ల ఆలస్యం అవుతూ వచ్చింది. ఎన్నికల కోసం ఈ సినిమాను తీయలేదు.


 తెలంగాణ సహా మహారాష్ట్ర, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలు స్వాతంత్ర్యం ఎప్పుడు వచ్చిందో కూడా తెలీదు. అందరూ 1947 ఆగస్ట్ 15న వచ్చిందని అనుకుంటారు. కానీ అది నిజం కాదు కదా?.. అందుకే ఆ విషయం అందరికీ తెలియాలనే ఈ రజాకార్ సినిమాను తెరెక్కించాను.  రజాకార్ వ్యవస్థ పాల్పడిన దురాగతాలను తెరపై చూపించాను. ఈ చిత్రంలో ఒక ఊరు, ఒక ప్లేస్ అంటూ చూపించలేదు. 1947 ఆగస్ట్ 15 నుంచి సెప్టెంబర్ 17 వరకు జరిగిన ఘటనలను ఇందులో చూపించాం. కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాలు కూడా కనిపిస్తాయి.


ఎన్నో పుస్తకాలు చదివాను.  ఈ సినిమా ప్రత్యక్ష వ్యక్తుల్ని కలిశాను. అందరి పాయింట్ ఆఫ్ వ్యూలో చరిత్రను చూశాను. అందరికీ ఆమోద యోగ్యంగా ఉండేలా రజాకార్ సినిమాను తీశాను. దాదాపు ఈ చరిత్రను పదిహేను చిత్రాలుగా తీయొచ్చు. ఎంత చూపించినా కొంత తక్కువే. 


 రజాకార్ వ్యవస్థ వల్ల తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల్లో జరిగింది. ఆ టైంలో చాలా ప్రాంతాలకు చాలా మంది బ్రతుకు తెరువు కోసం పారిపోయారు.  నాకు ఈ సినిమా చేస్తున్న టైంలో కేరళ, చెన్నై నుంచి ఫోన్‌లు వచ్చాయి. మన వాళ్లు ప్రతీ ఏరియాలో ఉన్నారు.


 తెలుగు కంటే రజకార్ మూవీకి  హిందీలోనే ఎక్కువగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రతీ ఒక్కరూ పాజిటివ్‌గా స్పందిస్తున్నారు. టీజర్‌కు నేషనల్ వైడ్‌గా డిబేట్లు జరిగాయి. మరాఠీ, ఢిల్లీ నుంచి కూడా ఫోన్లు వచ్చాయి. పశ్చిమ బెంగాల్ స్టోరీ మీద సినిమా చేయమని అక్కడి నుంచి ఫోన్లు వచ్చాయి.


బాబీ సింహా, అనసూయ, వేదిక, అనుష్య త్రిపాఠి, ప్రేమ‌, ఇంద్ర‌జ‌, మ‌క‌రంద్ దేశ్ పాండే ఇలా అన్ని భాషలకు చెందిన ప్రముఖ నటీనటులు ఈ సినిమా కోసం పని చేశారు. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు వద్ద పని చేసిన అనుభవంతో ఈ సినిమాను అవలీలగా తెరకెక్కించాను.  అందరూ తమ తమ పాత్రల్లో పరకాయ ప్రవేశం చేశారు.


భారతీ భారతీ పాటకూ, బీజేపీ పార్టీకి సంబంధం ఏంటి?.. భారతి అంటే నా అమ్మ, నా మాతృభూమి.. నా దేశం.. దానికీ పార్టీకీ సంబంధం లేదు. మా కష్టాలను భారత మాతకు చెబుతున్నామనే ఉద్దేశంలో ఆ పాట ఉంటుంది. సుద్దాల అశోక్ తేజ  రెండు పాటలు అద్భుతంగా రాశారు.


నేను చరిత్రను ఎక్కడా తప్పుగా వక్రీకరించలేదు. తప్పుగా చెబితే చరిత్ర హీనుడిగా మిగిలిపోతాను.  కల్పితం చేసి, హీరోయిన్లు పెట్టి చరిత్రను తప్పుగా చెప్పలేను. జరిగిన చరిత్రను చెప్పాలనుకున్నాను. అదే రజాకార్ మూవీగా తెరకెక్కించాను. 


Also read: Social Media Harassment: సోషల్ మీడియాలో పైశాచిక ట్రోలింగ్, తట్టుకోలేక ఓ అభాగ్యురాలి ఆత్మహత్య



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook