Social Media Harassment: సోషల్ మీడియా వెలుగులోకి వచ్చాక ప్రయోజనాల కంటే దుష్పరిణామలే అధికమౌతున్నాయి. హద్దూ అదుపూ లేకపోవడంతో ఇష్టారాజ్యంగా అల్లరిమూకలు చెలరేగిపోతున్నాయి. తమకు నచ్చనిది ఏదైనా పోస్ట్ అయితే ఇక అంతే సంగతులు. ఆ వ్యక్తిపై పిచ్చికుక్కల్లా వెండపడుతున్నారు. మారుపేర్లతో సాటి మనిషన్న సంగతే మర్చి భయంకరంగా ప్రవర్తిస్తున్నారు.
ఇది 30 ఏళ్ల గీతాంజలి కధ. 5-6 ఏళ్ల ప్రాయమున్న ఇద్దరు చిన్నారుల తల్లి విషాదమిది. బంగారం పని చేసుకుని కుటుంబాన్ని పోషించే భర్త చంద్రశేఖర్. తెనాలికి చెందిన ఈమెకు ఇటీవలే ఇంటి పట్టా మంజూరైంది. మార్చ్ 4వ తేదీన జరిగిన పట్టాల పంపిణీ కార్యక్రమంలో హాజరైన గీతాంజలి పట్టా తీసుకుంది. ఇంటి పట్టా అందుకున్న ఆనందంలో ఓ యూట్యూబ్ ఛానెల్‌తో తన ఆనందం పంచుకుంది. తనకు ఇంటి పట్టా, పిల్లలకు అమ్మ ఒడి, అత్తమామలకు చేయూత, పింఛన్ కానుక వస్తున్నాయని చెబుతూ సంతోషం వ్యక్తం చేసింది. అందుకు కృతజ్ఞతగా వైఎస్ జగన్‌కు ఓటేస్తానని చెప్పుకొచ్చింది.
ఇదే ఆమె చేసిన నేరం. సోషల్ మీడియా వేదికగా వైసీపీ వ్యతిరేక శక్తులు ఆమెను ఘోరంగా వెంటాడాయి. రాయలేని బూతులతో ఆమె వ్యక్తిత్వంపై దాడి చేశాయి. వీధి కుక్కల్లా వెంటపడి హింసించాయి. ఎంత దారుణమంటే ఆ కామెంట్లతో ఇక ఆమె తలెత్తుకోలేదు. ఏదో ఆమెతో జాతి వైరమున్నట్టుగా ఆమెతో సంబంధం లేని వ్యక్తులు సైతం క్రూరంగా హింసిస్తూ కామెంట్లు పెట్టారు. అది కూడా మారు పేర్లతో సోషల్ మీడియా ఐడీలు క్రియేట్ చేసుకుని అత్యంత దారుణంగా ట్రోలింగ్ చేశారు.
ఎంతైనా సగటు సామాన్య మహిళ. రాజకీయాల్లో తిరిగే వ్యక్తి కానేకాదు. అందుకే ఈ ట్రోలింగ్ తట్టుకోలేకపోయింది. తెనాలి రైల్వే ట్రాక్‌పై రైలుకు ఎదురెళ్లి ఆత్మహత్య చేసుకుంది. హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకపోయింది. చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలింది.
Also read: AP Alliance Seats: పవన్‌కు భారీ షాక్.. సీట్లు పంచుకున్న టీడీపీ, బీజేపీ.. జనసేనకు రెండు కోత
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook