Telangana Government Not Giving State Honours to K Viswanath Funeral: సుమారు తెలుగులో 50 కి సినిమాల పైగా దర్శకత్వం వహించి శంకరాభరణం, సిరివెన్నెల, స్వయంకృషి లాంటి ఎన్నో కల్ట్ క్లాసిక్ సినిమాలు తెలుగు సినీ పరిశ్రమకు అందించిన కళాతపస్వి కే.విశ్వనాథ్ మరణం టాలీవుడ్ మొత్తానికి షాక్ కలిగించింది. తెలుగు సినీ పరిశ్రమలో ఆ తరం వారి ఒక్కరొక్కరుగా వెళ్ళిపోతూ ఉండటంతో ఇప్పటికే సినీ ప్రేమికులందరూ చాలా బాధపడుతున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇప్పుడు కె.విశ్వనాథ్ కూడా మరణించడంతో వారంతా ఎంతో ఆవేదనలో కూరుకుపోయారు. అయితే కే.విశ్వనాథ్ మృతి చెందిన తర్వాత సాధారణంగా ప్రభుత్వం తరఫున ఆయనకు ప్రభుత్వ లాంచనాలతో అంత్యక్రియలు జరుపుతారని అందరూ భావించారు. ఎందుకంటే ఆయన తన కెరీర్లో ఎన్నో అత్యుత్తమ అవార్డులు, రివార్డులు పొందడమే కాక వర్గాల వారందరూ అత్యుత్తమంగా భావించే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కూడా దక్కించుకున్నారు.


కానీ తెలంగాణ ప్రభుత్వం ఆయన అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో చేయలేదు. అదేమిటి అని ఆరా తీసే ప్రయత్నం చేస్తే తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుతానికి అధికారిక లాంచనాలతో అంత్యక్రియలు జరిపే విషయం మీద బ్రేక్ తీసుకుందని తెలుస్తోంది. ఎందుకంటే ఇటీవల నిజాం వారసుడు చనిపోగా తెలంగాణ ప్రభుత్వం అధికారిక లాంచనాలతో ఆయన అంత్యక్రియలు నిర్వహించింది.


ఇందులో ప్రభుత్వానికి ఎలాంటి దురుద్దేశం లేదు, ఒకప్పుడు హైదరాబాద్ సహా చుట్టుపక్కల ప్రాంతాలన్నీ నిజాం సంస్థానంలోనే భాగంగా ఉండేవి అప్పట్లో పాలకులుగా ఉన్న వారి కుటుంబ సభ్యులకు సముచిత గౌరవం ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం భావించింది. అయితే అప్పట్లో నిజాం పాలనలో రజాకార్ల దుశ్చర్యలకు ఇబ్బంది పడిన వారందరూ ఈ విషయాన్ని తప్పుపట్టారు తమ కబంధహస్తాల్లో నిజాం సంస్థానాన్ని పెట్టుకొని పాకిస్తాన్లో కలపడానికి ప్రయత్నించిన వారి వారసులకు నేటి తెలంగాణ ప్రభుత్వం ఎలా అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరిపిందంటూ ప్రశ్నించారు.


ఈ విషయం రాజకీయంగా పెను సవాల్ గా మారడంతో ప్రస్తుతానికి తెలంగాణ ప్రభుత్వం తరఫున ఎవరికి అధికారిక లాంచనాలతో అంత్యక్రియలు జరపకూడదని నిర్ణయం తీసుకుందని అంటున్నారు. అందుకే ఇటీవల మరణించిన జమున మృతదేహానికి సైతం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు చేయలేదు. చివరిగా కైకాల సత్యనారాయణకి మాత్రమే తెలుగు సినీ పరిశ్రమ నుంచి ఈ అంత్యక్రియలు చేయడం జరిగింది.


ఇదంతా ఒక ఎత్తు అయితే వారి వల్ల ఉపయోగం ఉంటుందనుకుంటే తెలంగాణ ప్రభుత్వం తరఫున అధికారిక లాంఛనాలు చేస్తారు. కానీ ఉపయోగం లేదని భావిస్తే కూడా వారికి లాంఛనాలు తగ్గే అవకాశం లేదని అంటున్నారు, అయితే ఎన్నో లక్షల మంది హృదయాలను తన సినిమాలతో గెలుచుకున్న కె విశ్వనాథ్ కు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరపకపోవడం బాధాకరమైన విషయమే అయినా అంతమంది హృదయాలను గెలిచిన ఆయనకు అంతకన్నా లాంఛనం ఏమంటుందని ఆయన అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారం ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.


Also Read: RC vs PK: మా వాడే ఒరిజినల్ గాంగ్ స్టర్ అని కొట్టుకుంటున్న చరణ్, పవన్ ఫాన్స్!


Also Read: Sweets to K Vishwanath: కే విశ్వనాథ్ చివరి రోజుల్లో స్వయంగా అవి చేసి పంపిన కృష్ణంరాజు భార్య!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.