Krishnam Raju Wife sent Sweets to K Vishwanath: కళాతపస్వి విశ్వనాథ్ వయోభారం రీత్యా అనారోగ్యానికి గురై చికిత్స పొందుతూ అపోలో ఆసుపత్రిలో మరణించిన సంగతి తెలిసిందే. ఆయన అంత్యక్రియలు కూడా ఇటీవల హైదరాబాద్ లో పూర్తయ్యాయి. అయితే తాజాగా ఆయన కుటుంబాన్ని కృష్ణంరాజు భార్య శ్యామలాదేవి పరామర్శించారు పరామర్శించడమే కాదు కృష్ణంరాజు, విశ్వనాథ్ గారి మధ్య ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యారు.
కృష్ణంరాజు హీరోగా మారడానికి విశ్వనాథ్ గారు కూడా కారణం అయ్యారని ఒకానొక సినిమాలో కృష్ణంరాజు గారిని హీరోగా ఎంపిక చేసేందుకు ఆ సినిమాకి కో డైరెక్టర్ గా వ్యవహరిస్తున్న విశ్వనాధ్ గారు చొరవ చూపారని చెప్పుకొచ్చారు. అప్పుడే మీరు పెద్ద హీరో అవుతారని కృష్ణంరాజుకి విశ్వనాథ్ గారు చెప్పారని ఆమె గుర్తు చేసుకున్నారు. అయితే కృష్ణంరాజు గారు కూడా విశ్వనాథ్ గారి మీద ఎంతో ప్రేమ చూపిస్తూ ఉండేవారని కృష్ణంరాజు గారు బతికున్న సమయంలో క్రితం విశ్వనాధ్ గారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోమని తనకు పంపారని అన్నారు.
ఆ సమయంలో తాను వెళ్లి పరామర్శిస్తే ఆరోగ్యం బాగుండడం లేదని ఏమి తినలేక పోతున్నానని చెప్పారని చెప్పుకొచ్చారు. అలాగే తనకు స్వీట్ అంటే ఇష్టం కాబట్టి స్వీట్ తినాలనిపిస్తుంది కానీ ఇంట్లో వారెవరూ స్వీట్ చేసి పెట్టడం లేదని షుగర్ ఉండడంతో వారేమీ చేయలేకపోతున్నారని ఆయన బాధపడ్డారట. వెంటనే కృష్ణంరాజు సతీమణి శ్యామల మాట్లాడుతూ డైటీషియన్ ఖాదర్ వలీ గారు తాటి బెల్లం లేదా ఈత బెల్లంతో చేసిన స్వీట్లు తినవచ్చు అని చెప్పారని షుగర్ ఉన్నా తాటి బెల్లం, ఈత బెల్లం తింటే దానికి ఏమీ ఎఫెక్ట్ అవ్వదని చెప్పడంతో అదేదో నీ చేతి తోటే చేసి పంపమని అడిగారని తన ఇంటికి వెళ్లి ఆ బెల్లంతో స్వీట్లు చేసి పంపించడమే కాదు ఇంట్లో వాడుకోమని తాటి బెల్లం కూడా పంపాను అని కృష్ణంరాజు సతీమణి గుర్తు చేసుకున్నారు.
ఈ విషయాన్ని అనేక సందర్భాలలో అనేకమందికి చెప్పి విశ్వనాథ్ గారు ఆనందపడేవారు అని కృష్ణంరాజు గారికి కూడా ఫోన్ చేసి మీ ఆవిడ నాకు స్వీట్లు చేసి పంపించిందయ్యా అద్భుతంగా ఉన్నాయని ఎన్నో సందర్భాల్లో చెప్పారని ఆమె పేర్కొన్నారు. కృఇక ష్ణంరాజు గారు విశ్వనాధ్ గారు లాంటి మహానుభావులకు చావు లేదని వారి సినిమాల రూపంలో ఎప్పటికీ బతికే ఉంటారని ఈ సందర్భంగా ఆమె కామెంట్ చేయడం ఆసక్తికరంగా మారింది.
Also Read: RC vs PK: మా వాడే ఒరిజినల్ గాంగ్ స్టర్ అని కొట్టుకుంటున్న చరణ్, పవన్ ఫాన్స్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.