Reasons behind Puneeth Rajkumar's death: గుండెపోటు రావడం వల్లే కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్‌కుమార్ హఠాన్మరణం చెందారనే విషయం అందరికీ తెలిసిందే కానీ అంత ఆరోగ్యంగా, ఎనర్జిటిక్‌‌గా ఉండే పునీత్ ఇలా ఉన్నట్టుండి గుండెపోటుతో మరణించడం ఏంటనేదే చాలా మంది అభిమానులు జీర్ణించుకోలేకపోతున్న అంశం. నిత్య యవ్వనంగా, ఆరోగ్యంగా ఉండే పునీత్ రాజ్‌కుమార్ మరణానికి దారితీసిన పరిస్థితులేంటి ? వైద్యులు పునీత్‌ని ఎందుకు బతికించలేకపోయారు ? పునీత్ మృతికి అసలు కారణాలు ఏంటనే సందేహాలు చాలామంది మెదడు తొలిచేస్తున్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఫిట్‌గా ఉండేందుకు ఎంతో ఇష్టంగా వ్యాయమం చేసే రాజ్ కుమార్‌కి గుండె పోటు రావడంతో బెంగళూరులోని విక్రమ్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు అతడికి అత్యవసర చికిత్స అందించి బతికించే ప్రయత్నం చేశారు కానీ వారి ప్రయత్నాలు ఏవీ ఫలించలేదు. పునీత్ రాజ్‌కుమార్ గుండెలోని రక్తనాళాలు చిట్లి పోవడం వల్ల ఆయన మృతిచెందినట్లు (Puneeth Rajkumar's autospy report) వైద్యులు తెలిపారు. 


సాధారణంగా అయితే హార్ట్ ఎటాక్ (Heart attack) వచ్చినప్పటికీ.. పరిస్థితి అంత తీవ్రంగా లేకపోతే పునీత్ రాజ్‌కుమార్‌ని బతికించే అవకాశం ఉండేది. కానీ రక్తనాళాలు (Blood vessels) చిట్లిపోవడం వల్ల పరిస్థితి చేయిదాటిపోయిందని వైద్యులు చెబుతున్నారు.


Also read : Balakrishna pays Final Respects to Puneeth: పునీత్‌ను కడసారి చూసి కంటతడి పెట్టిన బాలకృష్ణ


చాలా రిస్కుతో కూడుకున్న వర్కౌట్స్‌ని కూడా పునీత్ రాజ్‌కుమార్ (Puneeth Rajkumar fitness) అతి సునాయసంగా చేసే వారని పునీత్ స్నేహితులు గుర్తు చేసుకుంటున్నారు. గతంలో కూడా పునీత్ రాజ్‌కుమార్ సోదరుడు శివరాజ్ కుమార్ (Shiva Rajkumar) ఇలాగే ఓసారి అనుకోకుండా హార్ట్ ఎటాక్‌కు బారినపడ్డారు. అయితే, అప్పుడు ఆయన హార్ట్ ఎటాక్ నుంచి కోలుకుని ప్రాణాలతో బయటపడటంతో అభిమానులు హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఈసారి పునీత్ రాజ్‌కుమార్ (Puneeth Rajkumar dies of cardiac arrest) విషయంలో అలా జరగలేదు.


Also read : Puneeth Rajkumar's last rites: పునీత్ చివరి చూపు కోసం.. బెంగళూరుకు టాలీవుడ్ అగ్ర హీరోలు


Also read : Puneeth Rajkumar's hit movies in pics: పునీత్ రాజ్ కుమార్ టాప్ 5 హిట్ మూవీస్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook