Regina Cassandra: ప్రెస్‌మీట్‌లో పాల్గొనేటప్పుడు ఆ మాత్రం కూడా తెలియదా.. రిపోర్టర్‌పై హీరోయిన్ ఫైర్!
Regina Cassandra fires on Reporter at Shakini Dakini Press Meet. శాకిని డాకిని` సినిమా ప్రెస్‌మీట్‌లో కథానాయిక రెజీనా కసాండ్రా రిపోర్టర్‌పై కాస్త ఫైర్ అయ్యారు.
Regina Cassandra fires on journalist at Shakini Dakini Press Meet: కథానాయికలు రెజీనా కసాండ్రా, నివేదా థామస్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'శాకిని డాకిని'. యువ డైరెక్టర్ సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను సురేష్ బాబు, గురు ఫిలింస్, క్రాస్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించారు. కొరియన్ మూవీ 'మిడ్ నైట్ రన్నర్స్' ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. సెప్టెంబర్ 16న 'శాకిని డాకిని' థియేటర్లలో విడుదల కానున్న నేపధ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాల్లో వేగం పెంచింది. ఈ క్రమంలో మంగళవారం హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్ జరిగింది. ఈ ప్రెస్‌మీట్‌లో రెజీనా కాస్త ఫైర్ అయ్యారు.
ప్రెస్‌మీట్‌లో భాగంగా 'మేడమ్.. శాకిని డాకిని సినిమాలో మీకు ఓసీడీ (అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్) ఉన్నట్లు కనిపించారు. నిజ జీవితంలో కూడా మీకు ఓసీడీ ఉందా?' అని రెజీనాను ఓ రిపోర్టర్ ప్రశ్నించాడు. ఈ ప్రశ్నకు ఇబ్బందికి గురైన రెజీనా.. 'ప్రతిఒక్కరిని మీరు ఇలాగే ప్రశ్నిస్తారా?. సినిమాలో మేము నటిస్తున్నామంతే. పాత్ర డిమాండ్ మేరకే నటిస్తాం. అమ్మాయిల్ని చాలా గొప్పగా చూపిస్తూ ఈ చిత్రాన్ని చేశాం. అలాంటిది మీరిలా నా పాత్ర, ఓసీడీ గురించి అడుగుతున్నారు?. వ్యక్తిగతంగా నేను శుభ్రత ఇష్టపడే వ్యక్తిని. ఓసీడీ లాంటి డిజార్డర్ నాకేమీ లేదు' అని అన్నారు.
వెంటనే సదరు రిపోర్టర్..'మేడమ్ నేను అడిగిన ఉద్దేశం వేరు. కరోనా వైరస్ అనంతరం అందరూ పరిశుభ్రత పాటిస్తున్నారు కదా. మీరు కూడా పరిశుభ్రంగా ఉండటానికి ఇష్టపడతారా? అని అడిగా' అని వివరణ ఇచ్చాడు. ఇక ప్రెస్‌మీట్ జరుగుతుండగా.. రిపోర్టర్‌ల ఫోన్లు వరుసగా రింగ్ అయ్యాయి. దాంతో రెజీనా అసహనానికి గురయ్యారు. 'నేను సీరియస్‌గానే అడుగుతున్నా.. ప్రెస్‌మీట్‌లో పాల్గొనేటప్పుడు మీరందరూ ఫోన్లు సైలెంట్‌లో పెట్టుకోరా?. ఎంత ఇబ్బందిగా ఉందో తెలుసా?' అంటూ రెజీనా ప్రశ్నించారు. వెంటనే అక్కడున్న వారంతా ఫోన్లు సైలెంట్‌లో పెట్టారు.
Also Read: kids in Car Boot: కారు డిక్కీలో పిల్లలు.. షాక్ ఇచ్చిన ట్రాఫిక్ పోలీసులు!
Also Read: Gold Price Today: వరుసగా రెండో రోజు పెరిగిన బంగారం ధర.. ఏయే నగరాల్లో ఎంత ధర పెరిగిందంటే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook