Vanchana: ఉమా మహేష్ హీరోగా సరికొత్త సినిమా.. వంచన కి విడుదల తేదీ ఫిక్స్..
Vanchana Uma Mahesh: ఉమ మహేష్ హీరోగా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా వంచన. చాలా ఆసక్తికరమైన కథాంశంతో కోర్టు రూమ్ ఎమోషనల్ డ్రామా చిత్రంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా కచ్చితంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది అని చిత్ర బృందం కాన్ఫిడెంట్ గా ఉంది. ఇక తాజాగా ఈ సినిమాకి విడుదల తేది ఖరారు చేశారు. ఈ విషయాన్ని వెల్లడిస్తూ చిత్ర బృందం సినిమా గురించి కూడా కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలియజేశారు.
Vanchana Release Date: ఉమా మహేష్ మార్పు హీరోగా స్వీయ దర్శకత్వంలో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా వంచన. సోనీ రెడ్డి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో సూర్య, రాజేంద్ర, ఆర్ కె నాయుడు, దివాకర్, శ్రీనివాస్, తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. చండీ దుర్గా ఎంటర్టైన్మెంట్స్ పతాకం వారు ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
అయితే తాజాగా ఈ చిత్రం విడుదల తేదీ పోస్టర్ ను సోషల్ మీడియా ద్వారా విడుదల చేసింది చిత్ర బృందం. ఈ చిత్రం నవంబర్ 8 న విడుదల అవుతుంది అని సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్భంగా దర్శకుడు, హీరో ఉమా మహేష్ మార్పు మాట్లాడుతూ వంచన ఒక కోర్టు రూమ్ ఎమోషనల్ డ్రామా చిత్రం అని ధ్రువీకరించారు.
అరకు ఊరిలో ఒక క్రిస్టియన్ ఫాదర్ అతి కిరాతకంగా హత్యకి గురి అవుతాడు. ఆకట్టుకునే స్క్రీన్ ప్లే తో అద్భుతమైన ట్విస్టులతో సినిమా సాగుతుంది. హత్య ఎవరు, ఎందుకు చేస్తారో తెలియాలంటే మా కోర్టు రూమ్ డ్రామా చూడాలి. మా సినిమాకి యూ/ఏ సర్టిఫికెట్ వచ్చింది. సెన్సార్ సభ్యులు మా సినిమా చూసి సెన్సిటివ్ కథని చాలా గొప్పగా చిత్రీకరించారు అని అభినందించారు" అని చెప్పుకొచ్చారు ఉమా మహేష్.
"ఈ మధ్యనే మా సినిమా టీజర్ ను విడుదల చేస్తే.. మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు థియేట్రికల్ ట్రైలర్ ని నవంబర్ 2 న విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాము. సినిమా చాలా కొత్తగా, థ్రిల్లింగ్ అంశాలతో నిండి ఉంటుంది. అరకు, ఢిల్లీ, మనాలి, హైదరాబాద్, విశాఖపట్నం, రాజమండ్రి, విజయనగరం, జైపూర్ లాంటి నగరాల్లో అందమైన లొకేషన్స్ బ్యాక్ డ్రాప్ లో మా సినిమా నడుస్తుంది. సినిమా కోసం రెడ్ డ్రాగన్ సినీ లైన్ కెమెరా వాడాం. మా సినిమా ఫస్ట్ కాపీ ఆల్రెడీ రెడీ అయిపోయింది. నవంబర్ 8న విడుదల చేయటానికి సిద్ధంగా ఉన్నాము" అని అన్నారు ఉమ మహేష్.
విజిత్ కృష్ణ సంగీతం అందించిన ఈ సినిమాకి గురుమూర్తి హెగ్డే కాన్నిపల్, నవీన్ హెగ్డే ఎడిటర్లుగా పని చేశారు. సినిమాటోగ్రఫీ బాధ్యతను సతీష్, భాస్కర్ చూసుకున్నారు. చిన్న సినిమాలు పెద్ద సక్సెస్ కు అందుకుంటున్న ఈ సమయంలో ఈ సినిమా ఎంత వరకు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.
Read more: KTR Case: నేను సాదాసీదా వ్యక్తి కాదు.. కొండా సురేఖను శిక్షించాల్సిందే: కోర్టులో కేటీఆర్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.