KTR Case: నేను సాదాసీదా వ్యక్తి కాదు.. కొండా సురేఖను శిక్షించాల్సిందే: కోర్టులో కేటీఆర్‌

KT Rama Rao Court Statement Against Konda Surekha: తన వ్యక్తిగత ప్రతిష్టను దిగజార్చేలా కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని న్యాయస్థానాన్ని కేటీఆర్‌ విజ్ఞప్తి చేశారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Oct 23, 2024, 05:17 PM IST
KTR Case: నేను సాదాసీదా వ్యక్తి కాదు.. కొండా సురేఖను శిక్షించాల్సిందే: కోర్టులో కేటీఆర్‌

KTR Defamation Case: సినీ హీరోయిన్లకు లింక్‌ చేసి తనపై విచక్షణ రహితంగా కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ మరోసారి తప్పుబట్టారు. ఇన్నాళ్లు ప్రజా వేదికగా తిప్పికొట్టిన కేటీఆర్‌ న్యాయ పోరాటానికి దిగారు. కొండా సురేఖ తన పరువుకు భంగం కలిగించేలా వ్యవహరించారని.. ఆమెపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా తాను రాజకీయాల్లో.. ప్రభుత్వంలో కీలక వ్యక్తిగా పని చేసినట్లు వివరించారు.

Also Read: KTR: కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి అనుచరుడి హత్య.. కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు

సమంత నాగచైతన్య విడాకులకు తనను కారణంగా చూపడం.. జుగుప్సకరంగా కొండా సురేఖ అక్టోబర్ 2వ తేదీన చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా కలకలం రేపాయి. సినీ పరిశ్రమతోపాటు మహిళా సంఘాలు తీవ్రంగా తప్పుబట్టిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో కొండా సురేఖపై పరువు నష్టం దావా వేసిన కేటీఆర్‌ తాజాగా హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టులో వాదనలు వినిపించారు. న్యాయమూర్తి ముందు హాజరై కేటీఆర్‌ తన వాంగ్మూలం ఇచ్చారు.

Also Read: Jagga Reddy: బ్రాయిలర్ కోడి కేటీఆర్.. నాటుకోడి రేవంత్ రెడ్డి: జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

కేటీఆర్‌ వాంగ్మూలం ఇదే 
'అమెరికాలో ఆరేళ్లు విద్యాభ్యాసం చేశా. చదువు పూర్తయ్యాక స్వదేశం తిరిగి వచ్చాన. ఇక్కడకు వచ్చాక తెలంగాణ ఉద్యమం జరుగుతుంది. 2006 ఆగస్టు  కేసీఆర్ కరీంనగర్ లోక్‌సభ స్థానానికి రాజీనామా చేశారు. మళ్లీ ఉప ఎన్నికలు వచ్చాయి.2006 నుంచి 2009లో నేను తెలంగాణ రాష్ట్ర సమితి ప్రధాన కార్యదర్శిగా పనిచేశా. తెలంగాణ ఉద్యమంలో అనేక పోరాటాలు చేశా. 2009లో సిరిసిల్ల నుంచి అసెంబ్లీ నుంచి గెలిచా. ఐదు సార్లు నేను ఎమ్మెల్యేగా గెలిచా' అని కోర్టులో కేటీఆర్‌ వివరించారు.

 

'ప్రతి ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలుపొందా. 2014లో నేను మంత్రిగా పనిచేశా. 2023 వరకు నేను మంత్రిగా ఉన్నా. 2018 తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంటగా ఎన్నికయ్యా. ప్రజా జీవితంలోనే ఉన్నా. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అవార్డు రివార్డులు వచ్చాయి. చాలాకాలం బ్యాడ్మింటన్ అసోసియేషన్, లాండ్ అసోసియేషన్‌తో కలిసి పనిచేశా. దేశంనే ఐటీ మినిస్టర్‌గా అనేక కంపెనీలను తెలంగాణ రాష్టానికి తీసుకు వచ్చా' అని కేటీఆర్‌ వెల్లడించారు. నా పరువు ప్రతిష్ట దెబ్బ తీసేలా కొండా సురేఖ మాట్లాడారని కేటీఆర్‌ స్పష్ట చేశారు.

కఠిన చర్యలు తీసుకోవాల్సిందే
'18 ఏళ్లుగా రాజకీయ జీవితంలో ఉన్న నన్ను ఆమె తన మాటలతో తీవ్ర ఇబ్బందులకు గురి చేసింది. నిరాధార ఆరోపణలు చేసిన మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. రాజకీయ కక్ష్య సాధింపు చర్యలో భాగంగానే ఇలాంటి వాఖ్యాలు చేశారు. సమాజంలో ఉన్న మంచి పేరు ప్రతిష్టలను దిగజార్చాలనే ఆమె అలాంటి వాఖ్యలు చేశారు. అన్ని ఆధారాలను కోర్టుకు సమర్పించా. యూట్యూబ్ లింక్స్, పేపర్ కథనాల అన్ని కోర్టు కు ఇచ్చా. చట్ట ప్రకారం కొండా సురేఖఫై చర్యలు తీసుకోవాలి' అని న్యాయస్థానాన్ని కేటీఆర్‌ కోరారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News