Remove Thaman From SSMB28: మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో తన 28వ సినిమా చేస్తున్నాడు, సర్కారు వారి పాట లాంటి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న మహేష్ బాబు వెంటనే సినిమా చేస్తారని అందరూ అనుకున్నారు. కానీ ఆయన సినిమా తర్వాత కొంత గ్యాప్ తీసుకోవడం ఆ తర్వాత తన  తర్వాత తండ్రి మరణించడంతో చాలా గ్యాప్ వచ్చేసింది. ప్రస్తుతానికి ఆయన త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తున్న సినిమాని సూపర్ స్టార్ మహేష్ బాబు 28వ సినిమాగా సంబోధిస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సినిమాలో పూజా హెగ్డే, శ్రీ లీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతానికి ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ పెద్ద ఎత్తున జరుగుతోంది, అయితే ఇప్పుడు తాజాగా మహేష్ బాబు అభిమానులు ఈ సినిమాకి సంగీతం అందిస్తున్న తమన్ విషయంలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి సర్కారు పాట సినిమాకి కూడా తమన్ మ్యూజిక్ డైరెక్టర్గా వ్యవహరించాడు. అయితే ఆ సినిమాకి మంచి ట్యూన్స్ ఇవ్వలేదని అప్పటి నుంచి మహేష్ అభిమానులు తమన్ మీద గుర్రుగా ఉన్నారు.


తాజాగా ఎందుకు మొదలుపెట్టారో? ఎలా మొదలుపెట్టారో? తెలియదు కానీ సూపర్ స్టార్ మహేష్ బాబు 28వ సినిమా నుంచి తమన్ ను తప్పించాలని అంటూ ట్విట్టర్లో ట్రెండింగ్ మొదలుపెట్టారు. కొంతమంది అయితే ఏకంగా తమన్ ను, సినిమా నిర్మాత నాగవంశీని ట్యాగ్ చేసి తమన్ ను సినిమా నుంచి తప్పించాలని కోరుతున్నారు. దీనికి తమన్ కూడా ఆసక్తికరంగా స్పందించాడు, డియర్ నెగిటివిటీ రెస్ట్ ఇన్ పీస్ అలాగే ఇక్కడ ఉన్న పిల్లలందరికీ అని చెబుతూ తాను చేతితో గిటార్ వాయిస్తూ ఉన్నట్లుగా ఒక ఫోటో షేర్ చేశారు.


అంటే తనను సినిమా నుంచి తప్పించమని డిమాండ్ చేస్తున్న మహేష్ బాబు అభిమానులందరినీ పిల్లలుగా అభివర్ణిస్తూ తమన్ కొట్టి పారేశాడు. అయితే గతంలో అల వైకుంఠపురం సినిమా సరిలేరు నీకెవ్వరు సినిమా పోటా పోటీగా రిలీజ్ అయినప్పుడు అలా వైకుంఠపురం సినిమాని పొగిడేందుకు తమన్ మహేష్ బాబు సినిమాని అవమానించాడు అని చెబుతూ అప్పటి వీడియోలను గతంలో అనేక ఇంటర్వ్యూలలో మాట్లాడిన వీడియోలను షేర్ చేస్తూ తమన్ ను ఈ సినిమా నుంచి తప్పించాలని వారంతా డిమాండ్ చేస్తున్నారు.


Also Read: Dhanush Focus; విజయ్ దెబ్బకు గుణపాఠం నేర్చుకున్న ధనుష్.. అందుకే ఆ తప్పు చేయకుండా!


Also Read: Naveen Reddy Atluri Arrested: చీటింగ్ కేసులో టాలీవుడ్ హీరో అరెస్ట్!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.