Dhanush Focus; విజయ్ దెబ్బకు గుణపాఠం నేర్చుకున్న ధనుష్.. అందుకే ఆ తప్పు చేయకుండా!

Dhanush Focus on Telugu Market: ధనుష్ హీరోగా తెరకెక్కిన సార్ సినిమాకి మాత్రం గట్టిగా ప్రమోషన్స్ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది, ఈ విషయం మీద అయన ఫోకస్ చేశారని అంటున్నారు. ఆ వివరాల్లోకి వెళితే

Written by - Chaganti Bhargav | Last Updated : Feb 4, 2023, 02:22 PM IST
Dhanush Focus; విజయ్ దెబ్బకు గుణపాఠం నేర్చుకున్న ధనుష్.. అందుకే ఆ తప్పు చేయకుండా!

Dhanush Focus on Telugu Market: ఈ మధ్యకాలంలో తెలుగు దర్శకులు తమిళ్ హీరోలతో సినిమాలు చేయడం కామన్ అయిపోయింది, అదే విధంగా తమిళ దర్శకులు తెలుగు హీరోలతో సినిమాలు చేయడం కూడా జరుగుతోంది. అయితే తమిళ హీరోలతో మన తెలుగు దర్శకులు చేస్తున్న సినిమాలు మాత్రం హాట్ టాపిక్ గా మారుతున్నాయి. గతంలోనే శివ కార్తికేయన్ హీరోగా అనుదీప్ ప్రిన్స్ అనే సినిమాని బై లింగ్యువల్ మూవీగా తెరకెక్కిస్తే తరువాత వంశీ పైడిపల్లి వారిసు అనే సినిమా తర్కెక్కించారు. దాదాపుగా ఈ రెండు సినిమాలు డిజాస్టర్ ఫలితాలను అందుకున్నాయి ఇప్పుడు ధనుష్ హీరోగా వెంకి అట్లూరి వాతి అనే సినిమా తెరకెక్కించాడు.

తెలుగులో ఈ సినిమాను సార్ పేరుతో రిలీజ్ చేస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద తెరకెక్కించిన ఈ సినిమాలో ధనుష్ ఒక లెక్చరర్ పాత్రలో కనిపించబోతున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. సంయుక్త మీనన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాని పెద్ద ఎత్తున ఫిబ్రవరి 10వ తేదీన విడుదల చేసేందుకు సితార ఎంటర్టైన్మెంట్స్ టీం భావిస్తోంది. అయితే ధనుష్ సార్ తెలుగు రిలీజ్ విషయంలో ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. అదేమిటంటే సాధారణంగా తమిళ హీరోలు తెలుగు ప్రమోషన్స్ విషయంలో ఆసక్తి చూపించరు, వారికి మార్కెట్ ఎక్కువగానే ఉందని తెలిసినా ఎందుకో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు వారు ఆసక్తి చూపిస్తూ ఉండరు.

గతంలో విజయ్ విషయంలో కూడా ఇదే జరిగింది, అయితే శివ కార్తికేయన్ కొంతవరకు ప్రమోషన్స్ కి హాజరయ్యాడు కానీ ఆయనకు అంత మార్కెట్ లేకపోవడంతో నిర్మాతలకు వర్కౌట్ కాలేదు. ఇప్పుడు ధనుష్ హీరోగా తెరకెక్కిన సార్ సినిమాకి మాత్రం గట్టిగా ప్రమోషన్స్ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ రోజు చెన్నైలో తమిళ ఆడియో రిలీజ్ ఈవెంట్ జరగనుంది, తెలుగు ప్రమోషన్స్ సోమవారం నుంచి మొదలయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ కోసం అనేక ఈవెంట్లు ప్లాన్ చేయగా మీడియాతో కూడా సపరేట్గా మీడియా సంస్థలు ఇంటర్వ్యూ ఇచ్చేలాగా ప్లాన్లు చేసినట్లు చెబుతున్నారు.  ఎందుకంటే ఆయన నటిస్తున్న తరువాతి సినిమాలను కూడా తెలుగులో రిలీజ్ చేసే అవకాశాలు ఉండటంతో ఈ మేరకు ఆయన నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్లినట్లుగా ప్రచారం జరుగుతోంది.

మామూలుగానే ధనుష్ హీరోగా తెరకెక్కిన అనేక సినిమాలను తెలుగులో కూడా రిలీజ్ చేస్తున్నారు. కానీ ధనుష్ కి అంటూ సపరేట్గా తెలుగులో పెద్ద మార్కెట్ ఏమీ లేదు. అజిత్, విజయ్, రజినీకాంత్ కమల్ హాసన్ వంటి హీరోలతో పోలిస్తే ధనుష్ సినిమాలు ఎప్పుడొచ్చి వెళ్ళిపోతున్నాయో కూడా తెలుగు ప్రేక్షకులకు తెలియదు. అయితే ఇప్పుడు చేస్తున్నది తెలుగు దర్శకుడితో, తెలుగు బ్యానర్ సినిమా కావడంతో ఈ సినిమా మీద తెలుగు ప్రేక్షకులు ఆసక్తి చూపించే అవకాశాలు ఉన్నాయి, దాన్ని సద్వినియోగం చేసుకోవాలని ధనుష్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరి తెలుగు ప్రేక్షకులకు ధనుష్ ఈమేరకు ఆకట్టుకుంటారు అనేది సినిమా రిలీజ్ తర్వాతే చెప్పగలమని అంటున్నారు విశ్లేషకులు, 
Also Read: Lakshmi Parvathi on Jr NTR: లేట్ అయింది, ఎన్టీఆర్ వచ్చినా ఉపయోగం లేదు...లక్ష్మీ పార్వతి సంచలనం!

Also Read: Butta Bomma Movie Review: అనిఖా సురేంద్రన్- అర్జున్ దాస్ 'బుట్టబొమ్మ' రివ్యూ... హిట్ కొట్టారా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 
 

Trending News