Renu Desai Health Issue సెలెబ్రిటీలంతా కూడా ప్రస్తుతం ఏదో ఒక వ్యాధితో బాధపడుతున్నారు. ప్రతీ ఒక్కరూ తమ తమ ఆరోగ్య సమస్యల గురించి బయటకు చెబుతున్నారు. సమంత, మమతామోహన్ దాస్, కల్పికా గణేష్ ఇలా అందరూ కూడా చర్మ సంబంధింత వ్యాధితో బాధపడుతున్నారు. ఇక ఈ మధ్యే హంసా నందినీ క్యాన్సర్‌తో పోరాడి జయించింది. ఇప్పుడు రేణూ దేశాయ్ తన ప్రస్తుత పరిస్థితి ఏమీ బాగా లేదని, గత కొన్నేళ్ల నుంచి తాను పోరాడుతూనే వస్తున్నాను అంటూ చెప్పుకొచ్చింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



 


నా శ్రేయోభిలాషులందరికీ ఓ విషయాన్ని చెప్పాలని అనుకుంటున్నాను. నేను ఇన్నేళ్లుగా ఎలాంటి పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నాను.. ఎలాంటి ఆరోగ్య సమస్యలతో పోరాడుతున్నానో మీకు చెప్పాలని అనుకుంటున్నాను.. నేను వాటిని ఎదుర్కొనేందుకు ఎంతటి శక్తిని కూడబెట్టుకున్నానో చెప్పాలి.. ఇప్పుడు ఈ రోజు ఇలా ఈ విషయాలన్నీ చెప్పేందుకు ఓ కారణం ఉంది.


నాలా ఎవరైనా బాధపడుతూ ఉంటే.. వారిలో ధైర్యాన్ని నింపేందుకు, పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ చేసేందుకు ఈ విషయాన్ని చెబుతున్నాను. మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ధైర్యాన్ని కోల్పోవద్దు.. బలంగా నిలబడాలి.. ఏదో ఒక రోజు మనకు ఫలితం వస్తుంది.. ఎప్పటికీ ఆశను కోల్పోవద్దు.. నిరుత్సాహపడొద్దు.. జీవితం మీద, మన మీద మనకు నమ్మకం ఉండాలి.. 


ఈ ప్రపంచం మనకోసం ఎన్నో సర్ ప్రైజ్‌లను ప్లాన్ చేసి ఉంది.. ఎలాంటి పరిస్థితులు వచ్చినా నవ్వుతూ వాటిని ఎదుర్కోండి.. నాకు ఇప్పుడు చికిత్స జరుగుతోంది.. మందులు వేసుకుంటున్నాను.. యోగా చేస్తున్నాను.. పోషకాహారాన్ని తీసుకుంటున్నాను.. త్వరలోనే మళ్లీ మామూలు మనిషిలా తిరిగి వస్తాను.. షూటింగ్‌లో పాల్గొంటాను అని చెప్పుకొచ్చింది. కానీ ఇంతకి తనకు వచ్చిన వ్యాధి ఏంటనే విషయాన్ని మాత్రం చెప్పలేదు.


రేణూ దేశాయ్ ఇప్పుడు ఒంటరిగా తన పిల్లలతోనే ఉంటున్న విషయం తెలిసిందే. అకిరా, ఆద్యలను పెంచుకుంటూ పవన్ కళ్యాణ్‌కు దూరంగానే ఉంటోంది. కానీ పిల్లల కోసం వీరిద్దరూ అప్పుడప్పుడూ కలుసుకుంటూ ఉన్నారు. చివరగా అకీరా నందన్ గ్రాడ్యుయేషన్ టైంలో స్కూల్‌లో కలుసుకున్న సంగతి తెలిసిందే.


Also Read:  manchu Lakshmi at Varanasi : వాలెంటైన్స్ డే.. వారణాసిలో మంచు లక్ష్మీ.. ట్వీట్ వైరల్


Also Read: Supritha Photos : వామ్మో అనిపించేలా సుప్రిత అందాలు.. తల్లితో కలిసి బీచ్‌లో అలా



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook