Renu Desai about Bharateeyudu 2: కమల్ హాసన్ హీరోగా చేసిన ఈ సినిమాలో సిద్ధార్థ కీలకపాత్రలో కనిపించారు. కనీసం మొదటి వారం మినిమం కలెక్షన్ కూడా అందుకోలేక.. బాక్సాఫీస్ దగ్గర ఘోరమైన పరాజయం చవిచూసింది ఈ చిత్రం. ఇక ఇండియన్ 3 చిత్రం ఉంటుంది అని అప్పట్లోనే శంకర్ ప్రకటించారు. కానీ ఈ సినిమా రిజల్ట్ తరువాత.. ఇండియన్ 3 ఉండే పరిస్థితి కనిపించడం లేదు. కాగా ఈ సినిమాని ఈ మధ్యనే ఓటీటీలో విడుదల చేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే ఓటీటీలో కూడా ఈ చిత్రం ఘోర పరాజయం చవిచూసింది.. శంకర్ అవుట్ డేటెడ్ కథ, మేకింగ్, టేకింగ్ పైన సోషల్ మీడియాలో విమర్శలు పోటెత్తాయి. సిద్ధార్థ ఓవర్ యాక్షన్ కూడా చూడలేకపోయాం అంటూ కామెంట్లు పెట్ట సాగారు సోషల్ మీడియా యూజర్స్.
అలా భారతీయుడు 2 సినిమా చివరకు డిజిటల్ ప్లాట్ ఫామ్ లో కూడా బోల్తా పడింది. ఈ క్రమంలో ఇప్పుడు ఈ చిత్రంపై రేణు దేశాయ్ సైతం మంది పడ్డారు. 


అసలు విషయానికి వస్తే ప్రస్తుతం సోషల్ మీడియాలో పెట్ లవర్స్‌ను  ఇండియన్ 2 తెగ బాధ పెడుతుంది. పెట్ లవర్స్ అంతా ఇప్పుడు రైటర్, దర్శకుడు శంకర్ మీద, ఇండియన్ 2 సినిమాలోని కొన్ని డైలాగ్స్ పైన తమ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాలో ఇంట్రవెల్లికి ముందు వచ్చే ఒక కీలక సన్నివేశంలో.. కుక్కల్ని కించపరిచేలా డైలాగ్స్ ఉంటాయి. అయితే ఈ డైలాగ్స్ పైన పెట్ లవర్స్ అంతా భగ్గు మంటున్నారు. అసలు కుక్కల పైన అలాంటి డైలాగ్స్ ఎలా పెడతారు అని..కుక్కలంటే అంత నీచమా అని కామెంట్లు పెడుతున్నారు. కుక్కల గురించి ఇష్టమొచ్చినట్టుగా డైలాగ్స్ రాసుకుంటే కుదరదు అని ఫైర్ అవుతున్నారు.


తాజాగా ఈ విషయంపై రేణు దేశాయ్ కూడా స్పందించింది. భారతీయుడు 2 లాంటి సినిమాలు.. ఫ్లాప్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది అని.. ఇది నిజంగానే ఫ్లాప్ కావాల్సిన సినిమానే అని.. అసలు ఈ ఇడియట్ రైటర్స్ ఎలా రాస్తున్నారు, అసలు వాళ్లకి ఏమైంది? అంటూ అసహనం వ్యక్తం చేసింది. మొత్తానికి రేణూ దేశాయ్ ఇలా ఘాటు వ్యాఖ్యలు చేయడంతో ఇండియన్ 2 సినిమా మరోసారి వార్తల్లోకి ఎక్కేసింది. అంతేకాదు ఇడిరైటర్ అని.. రేణుదేశాయ్ కామెంట్ పెట్టడంతో.. ఇన్ డైరెక్ట్ గా శంకర్ ని అంటుంది అంటూ కామెంట్లు పెడుతున్నారు సోషల్ మీడియా యూజర్స్.


Also Read: Virat Kohli: భారత్‌కు దూరంగా కోహ్లీ, అనుష్క.. బ్రిటన్‌లో సెటిల్ అయ్యేందుకు ప్లాన్..! 


Also Read: Traffic Restrictions: ఖైరతాబాద్‌ వెళ్లే వాహనదారులకు బిగ్‌ అలెర్ట్‌.. వినాయక చవితి సందర్భంగా ఈ రూట్లలో ట్రాఫిక్‌ మళ్లింపులు.. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.