Renu Desai : మనం ఎలాంటి బతుకు బతుకున్నామో ఓ సారి ఆలోచించుకోండి!.. అడవి బాటలో రేణూ దేశాయ్?
Renu Desai on Nature And Modern రేణూ దేశాయ్ ఎక్కువగా ప్రకృతి గురించి ఆలోచిస్తుంటుంది. నేచర్‌ను ఆస్వాధిస్తూ ఉండేందుకు ప్రయత్నిస్తుంటుంది. పక్షులు, జంతువులు, నదులు, చెట్లు, నీళ్లు అంటూ ఇలా తిరిగేస్తుంటుంది.
Renu Desai on Nature And Modern రేణూ దేశాయ్ ఇప్పుడు ఉన్న జీవన శైలి గురించి తన ఆవేదనను వ్యక్తం చేస్తోంది. నేచర్‌కు దూరంగా ఎక్కడో బతుకుతున్నాం.. ఇదేం బతుకు అన్నట్టుగా తన ఆలోచనలు పంచుకుంది. ఆద్య పెరిగి పెద్దయ్యాక తాను వెళ్లి అడవుల్లో బతుకుతాను అని చెప్పింది. ఈ మేరకు రేణూ దేశాయ్ వేసిన పోస్ట్ అందరినీ ఆలోచనల్లో పడేసింది.
మనం ఎత్తైన భవంతుల్లో బతుకుతూ.. అపార్ట్మెంట్లలో బతుకుతూ ఎంతో లగ్జరీగా ఉన్నామని అనుకుంటాం.. మనం ఎంతో సాధించాం.. ఎంతో ఎత్తుకు ఎదిగామని అనుకుంటాం.. అభివృద్ది పథంలో నడుస్తున్నామని అనుకుంటాం.. కానీ మనం ఎంతో పేదవాళ్లం.. ప్రకృతి అల్లంత దూరంలో బతుకుతున్నాం..
కదిలే ప్రవాహంలోని నీళ్లు, ఆ నీటిలో మనం కాళ్లు కూడా పెట్టలేకపోతోన్నాం.. స్వచ్చమైన గాలిని కూడా ఆస్వాధించుకోలేకపోతోన్నాం.. నేను ఇప్పుడు భూమికి ఎత్తులో, గాలికి దూరంగా.. పద్దెనిమిదో అంతస్థులో ఉన్నాం.. ఓ నాలుగు గోడల మధ్యలో బతుకుతున్నట్టుగా అనిపిస్తోంది.
మనం అభివృద్ది పేరిట మనం మన మూలాలను మరిచిపోతోన్నామా? ఒక వేళ నేనే తప్పుగా ఆలోచిస్తున్నానా? మన జాతి మనుగడ గురించి మన ఒకసారి పునరాలోచించుకోవాలి.. మన జీవితంలో ప్రకృతికి ఉన్న ప్రాధాన్యతను తెలుసుకోవాలి అంటూ రేణూ దేశాయ్ పోస్ట్ వేసింది.
ఆద్య పెరిగి పెద్దైతే.. తాను అడవుల్లో బతుకుతాను అంటూ రేణూ దేశాయ్ చెప్పుకొచ్చింది. పవన్ కళ్యాణ్‌కి సైతం ఇలాంటి ఆలోచనలే ఉండేవని తెలిసిందే. యుక్త వయసులో ఉన్నప్పుడే పవన్ కళ్యాణ్ అడవి బాట పట్టేందుకు ప్రయత్నించిన సంగతి తెలిసిందే.
రేణూ దేశాయ్ ప్రస్తుతం టైగర్ నాగేశ్వరరావు సినిమా షూటింగ్‌ను పూర్తి చేసింది. రవితేజ హీరోగా వస్తోన్న ఈ మూవీలో హేమలతా లవణం అనే కారెక్టర్‌ను రేణూ దేశాయ్ పోషించింది. ఇవి కాకుండా వెబ్ సిరీస్ కూడా చేస్తున్నాను అని అప్పట్లో ప్రకటించింది. కానీ కరోనా వల్ల ఆ ప్రాజెక్ట్ మూలకు పడ్డట్టుగా తెలుస్తోంది. ఇంత వరకు ఆ ప్రాజెక్ట్ గురించి మళ్లీ ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు.
Also Read: Sonu Nigam Attack Video : స్టార్ సింగర్‌పై ఎమ్మెల్యే కొడుకు దాడి.. ఈవెంట్‌లో గొడవ.. వీడియో వైరల్
Also Read: G V krishna rao Death : ఇండస్ట్రీలో విషాదం.. క్లాసిక్ సినిమాలకు పని చేసిన సీనియర్ ఎడిటర్ కన్నుమూత
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook