Prabhas Movie with KGF Director Prashanth Neel | కేజీఫ్ చిత్రంతో సౌతిండియాతో పాటు నార్త్ ఇండియాను టచ్ చేశాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. అతడి దర్శకత్వంలో ఇప్పటికే కేజీఎఫ్ ఛాప్టర్ 2 తెరకెక్కుతోంది. అయితే కేజీఎఫ్ సినిమాను మించిపోయేలా మరో సినిమా కోసం దక్షిణాదితో పాటు ఉత్తరాది ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఊహించినట్లుగానే భారీ అప్‌డేట్‌ను అందించారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ‘సలార్’ మూవీని ప్రకటించి ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


కేజీఎఫ్ సినిమా తెరకెక్కించిన హోంబలే చిత్ర నిర్మాణ సంస్థ సోషల్ మీడియా మైక్రో బ్లాగింగ్ వెబ్‌సైట్ ట్విట్టర్‌లో పాన్ ఇండియా మూవీ ‘సలార్’ (Prabhas Next Movie Titled As SALAAR)ను అనౌన్స్ చేసింది. ప్రభాస్, కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంభినేషన్‌కు దేశ వ్యాప్తంగా క్రేజ్ వస్తోంది. బాహుబలి తర్వాత ఉత్తరాదితో పాటు ప్రపంచ వ్యాప్తంగా ప్రభాస్ గుర్తింపు పొందాడు. ఇప్పుడు ఈ క్రేజ్‌ను క్యాష్ చేసుకునేందుకు హోంబలే చిత్ర నిర్మాణ సంస్థ ప్రభాస్, కేజీఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో భారీ ప్రాజెక్టుకు రంగం సిద్ధం చేసింది. 


Photo Story: Happy Birthday Silk Smitha: టాలీవుడ్ నటి సిల్క్ స్మిత.. ఆసక్తికర విషయాలు 


 



 


రెబల్ స్టార్ ప్రభాస్ తన ఫేస్‌బుక్‌లో ఇందుకు సంబంధించి మరింత అప్‌డేట్ అందించాడు. సలార్ ప్రపంచంలోకి నేను వెళ్లబోతున్నాను. వచ్చే ఏడాది జనవరిలో సలార్ షూటింగ్ ప్రారంభం కాబోతుందని అభిమానులకు శుభవార్త అందించాడు ప్రభాస్. ఈ సినిమాను కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ తెరకెక్కించనున్నాడు. దీంతో అభిమానులలో అంచనాలు పెరిగిపోతున్నాయి. 


Also Read : Voting Numbers of Bigg Boss 4 Contestants: ఓటింగ్ నెంబర్స్ ఇవే.. మిస్డ్ కాల్స్‌తో కంటెస్టెంట్‌ను సేవ్ చేయవచ్చు 


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


  • మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook