RGV Saree Movie title and first look released: ఇంట‌ర్నేష‌న‌ల్ శారీ డేను పురస్కరించుకుని రామ్‌గోపాల్ వ‌ర్మ(Ram Gopal Varma) త‌న కొత్త ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేశాడు. దీనికి కూడా శారీ అనే పేరు పెట్టాడు. తాజాగా టైటిల్ ను రివీల్ చేసి ఆడియెన్స్‌లో క్యూరియాసిటీని పెంచేశాడు. అయితే ఈ చిత్రానికి వర్మ కేవలం ప్రొడ్యూసర్ మాత్రమే. ఈ మూవీకి అఘోష్ వైష్ణ‌వం దర్శకత్వం వహిస్తున్నాడు. శారీ మూవీలో సోష‌ల్ మీడియా సెన్సేష‌న్ శ్రీల‌క్ష్మి స‌తీష్ ఫీమేల్ లీడ్ లో నటిస్తోంది. తాజాగా ఫస్ట్ లుక్ ను కూడా రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో శ్రీలక్ష్మీ సతీష్ సీరియస్ లుక్ లో కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గతంలో సోష‌ల్ మీడియాలో శ్రీల‌క్ష్మి స‌తీష్‌ చేసిన కొన్ని వీడియోలు, రీల్స్ విపరీతంగా వైర‌ల్‌గా అయ్యాయి. దీంతో ఈ బ్యూటీకి హీరోయిన్‌గా అవ‌కాశం ఇస్తాన‌ని వ‌ర్మ ప్ర‌క‌టించాడు. అన్నట్టుగానే మాట నిలబెట్టుకున్నాడు. శ్రీల‌క్ష్మి స‌తీష్(అలియస్ ఆరాధ్యదేవి) నటిస్తున్న ఈ మూవీ సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్‌గా రాబోతుంది. అతి ప్రేమ ఎలాంటి అన‌ర్థాల‌కు దారితీస్తుంద‌న్న‌ది ఈ మూవీలో చూపించ‌బోతున్న‌ట్లు వ‌ర్మ తెలిపాడు. మరోవైపు రామ్‌గోపాల్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న పొలిటికిల్ ఎంటర్ టైనర్ వ్యూహం నెల రోజుల గ్యాప్‌లోనే రెండు పార్టులుగా రిలీజ్ కాబోతోంది. డిసెంబ‌ర్ 29న పార్ట్ 1, జ‌న‌వ‌రి 25న పార్ట్-2 రాబోతున్నాయి. 



Also Read: Yatra 2 First look: ఏపీ సీఎం జగన్ బర్త్ డే గిఫ్ట్, యాత్ర 2 ఫస్ట్‌లుక్ విడుదల



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook