Salaar: ఆ రెండు సీన్స్ కోసమే A సర్టిఫికెట్.. పావుగంట ఏడ్చానన్న ప్రశాంత్ నీల్

Prashanth Neel Sensational Comments: ప్రభాస్ (Prabhas) ప్రపంచవ్యాప్త అభిమానులంతా ఎదురుచూస్తున్న సినిమా 'సలార్'(SALAAR). డిసెంబర్ 22న ఈ మూవీ వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతోంది. ప్రి రిలీజ్ ఈవెంట్స్, నటీనటులు, టెక్నికల్ టీమ్ ప్రచారం ఏదీ లేకుండా.. బాక్సాఫీస్ దగ్గర డైరెక్ట్ ఎటాక్ కు రెడీ అవుతున్న మూవీ ఇది. రీసెంట్ టైమ్స్ లో ప్రభాస్ సినిమా ఏదీ కూడా ఇంత సైలెంట్ గా రాలేదు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 24, 2023, 12:46 AM IST
Salaar: ఆ రెండు సీన్స్ కోసమే A సర్టిఫికెట్.. పావుగంట ఏడ్చానన్న ప్రశాంత్ నీల్

Prashanth Neel Sensational Comments: ప్రభాస్ (Prabhas) ప్రపంచవ్యాప్త అభిమానులంతా ఎదురుచూస్తున్న సినిమా 'సలార్'(SALAAR). డిసెంబర్ 22న ఈ మూవీ వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతోంది. ప్రి రిలీజ్ ఈవెంట్స్, నటీనటులు, టెక్నికల్ టీమ్ ప్రచారం ఏదీ లేకుండా.. బాక్సాఫీస్ దగ్గర డైరెక్ట్ ఎటాక్ కు రెడీ అవుతున్న మూవీ ఇది. రీసెంట్ టైమ్స్ లో ప్రభాస్ సినిమా ఏదీ కూడా ఇంత సైలెంట్ గా రాలేదు. 

Also read: Corona New Variant: భయపెడుతున్న కరోనా కొత్త వేరియంట్, కేరళ, తెలంగాణలో పెరుగుతున్న కేసులు

కలెక్షన్స్ ఊచకోతకు, భయంకరమైన వయొలెన్స్ కు ముందు ఉండే సైలెన్స్ ఇదీ అని ఫ్యాన్స్ అంటున్నారు. ప్రభాస్ సినిమా అంటే ప్రమోషన్స్ తో పనిలేదనేది ఫ్యాన్స్ చెప్పేమాట. ఐతే.. లేటెస్ట్ ఇంటర్వ్యూలో డైరెక్టర్ ప్రశాంత్ నీల్(Prashanth Neel) చెప్పిన ఓ మాట ఇప్పుడు ఫ్యాన్స్ కు మరింత వైబ్రేషన్ లోకి నెట్టేసింది. 

వయొలెంట్ డార్లింగ్ ప్రభాస్, ప్రశాంత్ నీల్, పృథ్వీరాజ్(Prithviraj Sukumaran) తో లెజెండరీ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి(SS Rajamouli) ఇంటర్వ్యూ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది. సలార్ రిలీజ్ ట్రైలర్ క్లిప్పింగ్స్ తో ఇప్పటికే పూనకంతో ఊగిపోతున్న అభిమానులకు ఇప్పుడు ప్రశాంత్ నీల్ చెప్పిన ఓ మాట మరింత మెంటలెక్కిస్తోంది.

రాజమౌళి అడిగిన ప్రశ్న... ప్రశాంత్ నీల్ చెప్పిన ఆన్సర్ క్యూరియాసిటీని మరింత పెంచేశాయి. ప్రభాస్ అభిమానుల్లో పిల్లలు కూడా ఉంటారు అలాంటి ప్రభాస్ మూవీకి సెన్సార్ బోర్డు A సర్టిఫికెట్ ఇస్తే ఎలా ఒప్పుకున్నారని రాజమౌళి .. ప్రశాంత్ నీల్ ను ఇంటర్వ్యూలో అడిగాడు. రీసెంట్ గా సెన్సార్ బోర్డ్ కొన్ని గైడ్ లైన్స్ మార్చిందని.. సలార్ మూవీలో వాళ్లు చెప్పిన చాలా కట్స్ కు ఓకే చెప్పానని అన్నాడు ప్రశాంత్ నీల్. ఐతే ఓ రెండు సీన్స్ కు మాత్రం తాను ఒప్పుకోలేదని చెప్పాడు. ఈ రెండు సీన్స్ లేకపోతే సలార్ మూవీకి అర్థమే లేదని.. ఖాన్సార్ అనేది వయొలెన్స్ కు అడ్డా అన్నప్పుడు ఈ రెండు సీన్స్ కచ్చితంగా ఉండాల్సిందేనని తాను భావించానన్నాడు. 

"మన సినిమాకు ఈ రెండు సీన్స్ చాలా ఇంపార్టెంట్. A సర్టిఫికెట్ అయినా ఓకే చెప్పండి" అని ప్రభాస్ తనతో అన్నాడని ప్రశాంత్ నీల్ చెప్పాడు. A సర్టిఫికెట్ ఇచ్చినందుకు 15 నుంచి 20 నిమిషాల పాటు సెన్సార్ ఆఫీస్ లో ఆఫీసర్ ముందు మౌనంగా ఏడ్చానని ప్రశాంత్ నీల్ ఇంటర్వ్యూలో చెప్పాడు. కేజీఎఫ్ సినిమాల్లో కంటే ఈ మూవీలో వయొలెన్స్ ఎక్కువగా ఉంటుందన్నాడు. 

తెలుగు సినిమాల్లో కొన్నేళ్లుగా ఎంతో వయొలెన్స్ చూశానన్న ప్రశాంత్ నీల్.. సెన్సార్ కొత్త కండిషన్స్ పై కొంత అసంతృప్తి వ్యక్తంచేశాడు. గత మూడు సినిమాలు తనకు నచ్చలేదని.. పెద్దగా ఎక్స్ పెక్టేషన్స్ ఏవీ అప్పుడు లేవన్నాడు ప్రశాంత్ నీల్. సలార్ మూవీని ఇష్టంగా తీశానని.. అందుకే ప్రేక్షకులు ఇచ్చే తీర్పుపై ఉత్కంఠగా, నెర్వస్ గా ఉందని చెప్పాడు.

డైనోసార్ ప్రభాస్ చేసే హింసను 70ఎంఎంలో ఎప్పుడెప్పుడు చూడాలా అని అభిమానుల తహతహలాడిపోతున్నారు. అంచనాలు పెట్టుకోవద్దని ఎంత లోప్రొఫైల్ మెయిన్‌టెయిన్ చేసినా కూడా ఎక్స్ పెక్టేషన్స్ మాత్రం అమాంతం పెరిగిపోయాయి. ఎలివేషన్స్ కా బాప్ లాంటి డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ సీన్స్ ను ఎలా తీస్తాడో అన్న ఊహాగానాలు మిన్నంటాయి.

Also read: Corona New Variant: భయపెడుతున్న కరోనా కొత్త వేరియంట్, కేరళ, తెలంగాణలో పెరుగుతున్న కేసులు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

 

Trending News