Is Sonakshi Sinha Engagement Over with Zaheer Iqbal: బాలీవుడ్ నటుడు శత్రుఘ్న‌ సిన్హా గారాల పట్టిగా సోనాక్షి సిన్హా ఫిల్మ్ ఇండ‌స్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. సల్మాన్ ఖాన్ హీరోగా వచ్చిన 'దబాంగ్‌' సినిమాలో నటించి మంచి మార్కులే కొట్టేశారు. ఆపై రౌడీ రాథోడ్‌, జోకర్‌, సన్నాఫ్‌ సర్ధార్‌, ఆర్‌.. రాజ్‌కుమార్‌, లింగా, వెల్‌కమ్‌ టు న్యూయార్క్‌, భుజ్‌ సినిమాలతో స్టార్ అయ్యారు. గ్లామ‌ర‌స్ పాత్రలే కాకుండా మహిళా ఓరియెంటెడ్ పాత్ర‌లు చేస్తూ.. సోనాక్షి త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన‌ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సోనాక్షి సిన్హా గత కొంత కాలంగా డేటింగ్‌లో ఉందంటూ సోషల్ మీడియాలో అప్పుడ‌పుడు వార్త‌లు వస్తున్నాయి. నటుడు జ‌హీర్ ఇక్బాల్‌తో సన్నిహితంగా క‌నిపించిన ఫొటోల కారణంగా.. అతడితో సోనాక్షి డేటింగ్‌లో ఉన్నారంటూ వార్తలు షికార్లు చేశాయి. వీటిపై ఇటీవలే జహీర్‌ స్పందిస్తూ.. మీరేమనుకున్నా నేను పట్టించుకోనన్నాడు. నేను సోనాక్షి సిన్హా తో ఉండటం మీకు సంతోషాన్ని కలిగిస్తే ఆనందించండి..  లేదా ఆలోచించడమే మానేయండని ఫైర్ అయ్యాడు. ఏదేమైనా నేను మాత్రం ఈ విషయాలను పట్టించుకోను అని జ‌హీర్ చెప్పుకొచ్చాడు.


ఇదిలా ఉంటే.. సోనాక్షి సిన్హా తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఫొటోస్ ఇపుడు హాట్ టాపిక్‌గా మారాయి. ఫింగ‌ర్ రింగ్ హైలెట్ అయ్యేలా.. క్లోజప్ యాంగిల్‌లో దిగిన ఫొటోను ఆమె పోస్ట్ చేశారు. అంతేకాదు ఓ వ్యక్తి చేతిని గట్టిగా పట్టుకుని ముసిముసి నవ్వులు పూయిచ్చారు. ఫోటోలలో చేతి వేలికి ఉంగ‌రం ఉండడమే ఇప్పుడు సోనాక్షి పేరు ట్రెండ్ అవుతోంది. 'నాకెంతో ప్రత్యేకమైన రోజు. నా కల నిజమైంది. ఈ విషయాన్ని మీతో పంచుకుంటున్నందుకు ఆనందిస్తున్నా. ఇది అంత సుల‌భంగా నమ్మలేకపోతున్నా' అని బొద్దుగుమ్మ సోనాక్షి క్యాప్ష‌న్ పెట్టారు.



ఫొటోస్ చూసిన నెటిజ‌న్లు ఊరుకుంటారా?.. సోనాక్షిసిన్హాకు నిశ్చితార్థం అయిపోయిందని కొందరు ట్వీట్లు చేస్తున్నారు. త్వ‌ర‌లోనే పెళ్లి పీటలెక్క్కబోతుంది అంటూ ఇంకొందరు కామెంట్స్ చేస్తున్నారు. కొద్దిమంది మాత్రం ఇది ప్రమోషనల్‌ స్టంట్‌ అని అంటున్నారు. సోనాక్షి జువెల‌రీ వ్యాపారాన్ని మొదలుపెట్టేందుకు సిద్ధమైందని, అందుకే ఇలా రింగ్‌తో హైప్ క్రియేట్ చేస్తున్నారని కామెంట్ పెడుతున్నారు. మరి ఆమెకు నిశ్చితార్థం అయిందా, షూట్‌లో భాగంగా స్టిల్‌ ఇచ్చిందా? అనేది తెలియాలంటే ఈ విషయంపై సోనాక్షి స్పష్టతనివ్వాల్సిందే.


Also Read: Horoscope Today May 10 2022: ఈరోజు రాశి ఫలాలు.. ఆ రాశుల వారి కోరిక నేడు నెరవేరనుంది!


Also Read: Asani Cyclone Live Update: గంటకు 12 కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తున్న అసనీ తుపాను


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook