Horoscope Today May 10 2022: ఈరోజు రాశి ఫలాలు.. ఆ రాశుల వారి కోరిక నేడు నెరవేరనుంది!

Daily Astrological prediction for May 10 2022. సింహం, కుంభ రాశుల వారికి శుభకాలం నడుస్తోంది. ఈ రెండు రాశుల వారి దీర్ఘ కాలిక కోరిక నేడు నెరవేరనుంది. 

Written by - ZH Telugu Desk | Last Updated : May 10, 2022, 06:30 AM IST
  • May 10 2022 రాశి ఫలాలు
  • ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే?
  • ఆ రాశుల వారి కోరిక నేడు నెరవేరనుంది
Horoscope Today May 10 2022: ఈరోజు రాశి ఫలాలు.. ఆ రాశుల వారి కోరిక నేడు నెరవేరనుంది!

Daily Astrological prediction for May 10 2022: మేషం ( Aries): ఆర్థిక రంగంలో కలిసివచ్చే కాలం. మనోధైర్యం గెలిపిస్తుంది. చాలా కాలంగా మిమ్మల్ని వేధిస్తున్న ఒక సమస్య తొలగిపోతుంది. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఇల్లు కొనడానికి లేదా నిర్మించడానికి మంచి సమయం. విష్ణు నామస్మరణ ఉత్తమం.

వృషభం (Taurus): కమీషన్ ప్రాతిపదికన పనిచేస్తున్న వారికి మంచి రోజు. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం వద్దు. ఉద్యోగాలు మారాలనుకునే వారికి శుభకాలం నడుస్తోంది. ప్రారంభించిన పనులలో ఇబ్బందులు ఎదురైనా.. వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. ఆస్తి సమస్య సామరస్యంగా పరిష్కరించబడుతుంది. ఇష్టమైన దైవారాధన మానవద్దు.

మిథునం (Gemini): పై అధికారుల సమస్యలు వస్తాయి. మిత్రుల వల్ల మేలు జరుగుతుంది. ఆరోగ్యం విషయంలో ఒకరి సలహా మీకు పనిచేస్తుంది. ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో గడుపుతారు. ప్రయాణాల్లో అజాగ్రత్త వద్దు. దత్తాత్రేయ స్వామి ఆరాధన మంచి ఫలితాన్ని ఇస్తుంది.

కర్కాటకం (Cancer): మునుపటి పెట్టుబడుల కారణంగా ఆర్థిక స్థిరత్వం ఉంది. ఆశించిన ఫలితాలు ఉన్నాయి. కీలక నిర్ణయాలు తీసుకోవడంలో సఫలం అవుతారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రారంభించిన పనులలో విజయం సాధిస్తారు. శని శ్లోకాన్ని చదివితే మంచిది.

సింహం (Leo): సమయానికి చేతికి డబ్బు అందుతుంది. ప్రారంభించిన పనులను పూర్తి చేయగలుగుతారు. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. పెండింగ్‌లో ఉన్న సమస్యలను క్లియర్ అవుతాయి. మీ కోరిక ఈ రోజు నెరవేరే అవకాశం ఉంది. ప్రయాణాల్లో జాగ్రత్త. దుర్గాధ్యానం శుభప్రదం.

కన్య (Virgo): డబ్బు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కృషి, పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు. దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వారి పరిస్థితి మునుపటి కంటే మెరుగవుతుంది. కొన్నాళ్లుగా పరిష్కారం కాని ఒక సమస్య తొలగిపోతుంది. సమాజంలో కీర్తి పెరుగుతుంది. కుటుంబంతో సరదాగా గడుపుతారు. గణపతిని పూజిస్తే శుభఫలితాలు కలుగుతాయి.

తుల (Libra): డబ్బు మీ ఉత్సాహాన్ని పెంచుతుంది. మీ వృత్తిపరమైన రంగంలో ఏదైనా కొత్తగా ప్రారంభించడానికి ఇది సరైన సమయం.. విచక్షణా జ్ఞానంతో ముందుకు సాగితే సమస్యలు తగ్గుతాయి. ఆరోగ్యం మరియు ఆర్థిక విషయాలలో ఎటువంటి సమస్యలు ఎదురుకావు. శ్రీరామరక్షా స్తోత్రం చదివితే మంచి జరుగుతుంది.

వృశ్చికం (Scorpio): ఖర్చును తగ్గిస్తేనే డబ్బును ఆదా చేయగలరు. పనులకు ఆటంకం కలుగకుండా చూసుకోవాలి. బుద్ధిబలంతో కొన్ని కీలక వ్యవహారాల నుంచి బయటపడగలుగుతారు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. కుటుంబంతో కలిసి ప్రయాణాలు చేస్తారు. ఇష్టదైవారాధన శుభప్రదం.

ధనస్సు (Sagittarius): అనుభవజ్ఞుడైన సహోద్యోగి సూచనలు మేలు చేస్తాయి. ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. ఆర్థికంగా కలిసొస్తుంది. ఒక వార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. విశ్రాంతి అవసరం. శివ సందర్శనం ఫలితాన్ని ఇస్తుంది.

మకరం (Capricorn): రుణ భారం తొలగిపోతుంది. వ్యాపారులకు అనువైన సమయం. శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. తెలివితేటలతో కీలక పనులను పూర్తిచేయగలుగుతారు. స్నేహితులు లేదా బంధువులతో ఆనందంగా గడుపుతారు. ఉద్యోగంలో శుభఫలితాలు ఉన్నాయి.  విష్ణు నామస్మరణ శక్తిని ఇస్తుంది.

కుంభం  (Aquarius): కొందరు దీర్ఘకాలంలో లాభదాయకంగా ఉండే వెంచర్‌ను ప్రారంభించే అవకాశం ఉంది. విహారయాత్రను ప్లాన్ చేయడానికి ఇది మంచి సమయం. కుటుంబ సభ్యుల సహకారంతో కొన్ని పనులు పూర్తిచేయగలుగుతారు. తప్పుదారి పట్టించే వారు ఉన్నారు జాగ్రత్త. మీ కోరిక ఈ రోజు నెరవేరే అవకాశం ఉంది. ఇష్టదైవ దర్శనం ఉత్తమం.

మీనం (Pisces): ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా మంచిది. మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అధిక ధన నష్టం ఉంది. కొన్ని కుటుంబ సభ్యుల సహకారంతో పూర్తిచేయగలుగుతారు. కుటుంబ వ్యవహారాలలో అప్రమత్తంగా ఉండాలి. పై అధికారులతో జాగ్రత్త. సాయినామాన్ని జపించాలి.

Also Read: KKR vs MI: ముంబై మరో ఓటమి, కోల్‌కతా నైట్‌రైడర్స్ చేతిలో 52 పరుగుల తేడాతో పరాజయం

Also Read: Wheat Prices Hiked: ఆకాశాన్నంటుతున్న గోధుమ ధరలు.. కారణం ఏంటంటే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

 

Trending News