Vijay vs Ajith: హీరో విజయ్ చనిపోయాడంటూ అజిత్ ఫ్యాన్స్ అగ్లీ ట్రోలింగ్.. సోషల్ మీడియాలో రచ్చ రచ్చ..
Ugly trolling on Thalapathy Vijay: అజిత్ ఫ్యాన్స్ చేస్తున్న ఈ అగ్లీ ట్రోలింగ్.. అదే ఫ్యాన్ గ్రూపులో కొంతమందికి నచ్చట్లేదు. నిజమైన అజిత్ ఫ్యాన్స్ ఇలా చేయరంటూ ట్విట్టర్‌లో వారు కామెంట్స్ చేస్తున్నారు.
Ugly trolling on Thalapathy Vijay: మా హీరో గొప్పంటే.. మా హీరో గొప్ప.. సోషల్ మీడియా వేదికగా స్టార్ హీరోల ఫ్యాన్స్ మధ్య ఇలాంటి యుద్ధాలు కామన్ అయిపోయాయి. కానీ కొన్నిసార్లు ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియా వార్ మరింత అగ్లీగా మారుతోంది. ట్రోలింగ్స్‌తో ఆగకుండా ఏకంగా సదరు నటీనటుల ఫోటోలకు దండలు వేసి.. చనిపోయారంటూ వెర్రి ప్రచారం చేస్తున్నారు. తాజాగా తమిళ స్టార్ హీరో విజయ్ విషయంలోనూ ఇదే జరుగుతోంది. విజయ్ అంటే గిట్టని అజిత్ ఫ్యాన్స్ 'RIPJosephVijay' హాష్ ట్యాగ్‌ను ట్విట్టర్‌లో ట్రెండ్ చేస్తున్నారు. విజయ్ చనిపోయినట్లుగా మీమ్స్ క్రియేట్ చేసి ట్విట్టర్‌లో వదులుతున్నారు.
'ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్‌గా ధోని తప్పుకోవడం.. జడేజా కెప్టెన్సీ పగ్గాలు చేపట్టడంతో.. దాన్ని తట్టుకోలేక ధోని డై హార్డ్ ఫ్యాన్ విజయ్ జోసెఫ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.' అంటూ అజిత్ ఫ్యాన్స్ ట్విట్టర్‌లో పోస్టులు పెడుతున్నారు. మరికొందరు చెత్త చెత్త కామెంట్స్‌తో విజయ్ చనిపోయాడంటూ పోస్టులు పెడుతున్నారు. 'RIPJosephVijay' హాష్ ట్యాగ్‌తో ఇప్పటివరకూ 30 వేల పైచిలుకు ట్విట్టర్ పోస్టులు పెట్టారంటే.. ఈ అగ్లీ ట్రోలింగ్ ఏ రేంజ్‌లో జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు.
అజిత్ ఫ్యాన్స్ చేస్తున్న ఈ అగ్లీ ట్రోలింగ్.. అదే ఫ్యాన్ గ్రూపులో కొంతమందికి నచ్చట్లేదు. నిజమైన అజిత్ ఫ్యాన్స్ ఇలా చేయరంటూ ట్విట్టర్‌లో వారు కామెంట్స్ చేస్తున్నారు. కాగా, తమిళంలో విజయ్, అజిత్‌లకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ ఇద్దరి హీరోల మధ్య ఎటువంటి విభేదాలు లేనప్పటికీ.. ఫ్యాన్స్ మాత్రం తరచూ ఇలా సోషల్ మీడియా యుద్ధాలకు తెరలేపుతుంటారు. 1990ల నుంచి ఈ ఇద్దరు స్టార్ హీరోల మధ్య ఫ్యాన్ వార్ కొనసాగుతోంది. అప్పుడప్పుడు అది మరింత శృతిమించి ఇదిగో ఇలా అగ్లీ ట్రోలింగ్‌కి దారితీస్తోంది. హీరోల పట్ల అభిమానం ఉండటంలో తప్పు లేదు కానీ.. ఇతర హీరోల పట్ల అసూయ ఉండకూడదని పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
Also Read: AP New Districts: ఏపీ కొత్త జిల్లాలపై 4-5 రోజుల్లో తుది నోటిఫికేషన్ విడుదల
Also Read: Video: గుండెలు పిండేసే వీడియో.. కూతురి శవాన్ని భుజాలపై 10కి.మీ మోసుకెళ్లిన తండ్రి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook