Kantara Telugu Movie Day 2 Collections : కాంతారా సినిమాకు మౌత్ టాక్ అదిరిపోయింది. దీంతో కంతారా సినిమా కలెక్షన్లు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. కాంతారా సినిమా దెబ్బకు అన్ని ఇండస్ట్రీల బాక్సాఫీస్‌లు షేక్ అవుతున్నాయి. తమిళం, హిందీ భాషల్లోనూ కాంతారా అదిరిపోయింది. తెలుగులో అయితే మొదటి రోజే బ్రేక్ ఈవెన్ అయింది. రెండు కోట్ల బిజినెస్ చేసిన ఈ చిత్రం మొదటి రోజే.. రెండున్నర కోట్ల షేర్‌తో దుమ్ములేపేసింది. అలా మొదటి రోజే లాభాల బాట పట్టేసింది కాంతారా. అయితే విపరీతమైన మౌత్ టాక్, పాజిటివ్ రివ్యూలతో కాంతారా సినిమా రేంజ్ మారిపోయింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కాంతారా సినిమాకు శనివారం కంటే.. ఆదివారం నాడు ఇంకా ఎక్కువ కలెక్షన్లు వచ్చాయి. సోమవారం కూడా ఈ సినిమాకు మంచి కలెక్షన్లు వచ్చేట్టు కనిపిస్తోంది. అన్ని థియేటర్లో కాంతారా హౌస్ ఫుల్ బోర్డులతో నడుస్తోంది. రెండోరోజు ఈ చిత్రం దాదాపు ఐదు కోట్ల గ్రాస్.. రెండున్నర కోట్ల షేర్ సాధించినట్టు తెలుస్తోంది. అలా ఈ రెండు రోజుల్లోనే పది కోట్ల గ్రాస్.. ఐదు కోట్ల షేర్ సాధించినట్టు సమాచారం అందుతోంది.


అయితే కాంతారా సినిమా ఇప్పటి వరకు కన్నడలో వంద కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. ఇంకా అక్కడ భారీ కలెక్షన్లను సాధిస్తోంది. 15 కోట్ల లోపు బడ్జెట్‌తో తెరకెక్కించిన కాంతారా ఆల్రెడీ వంద కోట్లను కొల్లగొట్టేసింది. ఇక ఇప్పుడు అన్ని భాషల్లోకి డబ్ అవ్వడంతో కలెక్షన్లు మరింతగా పెరుగుతున్నాయి. రిషభ్ శెట్టి టేకింగ్, యాక్టింగ్ ఈ సినిమాకు ప్రాణంగా మారాయి.


మరీ ముఖ్యంగా కాంతారా సినిమా క్లైమాక్స్ నెవ్వర్ బిఫోర్ ఎవ్వర్ ఆఫ్టర్ అనే ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చింది. అక్కడే కాంతారా సక్సెస్ అయింది. కాంతారా సినిమాకు తెలుగు ప్రేక్షకులు నీరాజనాలు పడుతున్నారు. రెండు రోజుల్లోనే తెలుగు రాష్ట్రాల్లో పది కోట్లకు పైగా గ్రాస్ రాబట్టేసింది.


ఏరియాలా వారిగా చూసుకుంటే రెండో రోజు ఈ చిత్రం.. నైజాంలో 1.18 కోట్లు, సీడెడ్‌లో 38 లక్షలు, ఉత్తరాంధ్రలో 36 లక్షలు, ఈస్ట్ 24 లక్షలు, వెస్ట్ 16 లక్షలు, గుంటూరు 19 లక్షలు, కృష్ణా 17 లక్షలు, నెల్లూరు 12 లక్షలు రాబట్టింది. అలా మొత్తంగా రెండో రోజు 5.50 కోట్ల గ్రాస్, 2.80 కోట్ల షేర్ సాధించింది.


అదే రెండు రోజుల్లో ఏరియాలా వారిగా చూసుకుంటే.. నైజాంలో 2.12 కోట్లు, సీడెడ్‌లో 66 లక్షలు, ఉత్తరాంధ్రలో 61 లక్షలు, ఈస్ట్ 42 లక్షలు, వెస్ట్ 26 లక్షలు, గుంటూరు 33 లక్షలు, కృష్ణా 29 లక్షలు, నెల్లూరు 21 లక్షలు వచ్చాయి.  అలా మొత్తంగా రెండు రోజుల్లో దగ్గరదగ్గరగా పది కోట్ల గ్రాస్, 5 కోట్ల షేర్ సాధించింది.


Also Read : Hansika Motwani Marriage : సైలెంట్‌గా హన్సిక పెళ్లి ఏర్పాట్లు.. వేదిక ఎక్కడంటే?


Also Read : Manchu Vishnu - Payal rajput : పాయల్ పరువుతీసిన మంచు విష్ణు


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook