Manchu Vishnu - Payal rajput : దీనక్కా ఇది ఊరికే మాట్లాడుతోంది.. పాయల్ పరువుతీసిన మంచు విష్ణు

Manchu Vishnu Satires on Payal rajput మంచు విష్ణు ప్రస్తుతం జిన్నా మూవీ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నాడు. పాయల్ రాజ్‌పుత్ మంచు విష్ణు కలిసి తెగ సందడి చేస్తున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 17, 2022, 02:16 PM IST
  • అక్టోబర్ 21న రాబోతోన్న జిన్నా
  • మంచు లక్ష్మీ వంటల షో
  • పాయల్‌ను ఆడుకున్న మంచు విష్ణు
Manchu Vishnu - Payal rajput : దీనక్కా ఇది ఊరికే మాట్లాడుతోంది.. పాయల్ పరువుతీసిన మంచు విష్ణు

Manchu Vishnu - Payal rajput : మంచు విష్ణు ఈ వారం ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. జిన్నా సినిమాతో తన లక్ పరీక్షించుకోబోతోన్నాడు. అక్టోబర్ 21న ఈ చిత్రం రాబోతోంది. అయితే ఈ సినిమా కోసం మంచు విష్ణు ఏం చేయగలడో అంతా చేస్తున్నాడు. ప్రమోషన్స్ కోసం ఫుల్ టైం కేటాయిస్తున్నాడు. సన్నీ లియోన్‌ను కూడా సినిమా కోసం తిప్పుతున్నాడు. ఇక పాయల్, మంచు విష్ణు ఇద్దరూ కూడా సినిమా ప్రమోషన్స్ కోసం బాగానే టైం కేటాయిస్తున్నారు.

అయితే ఇప్పుడు తాజాగా ఆహా సోషల్ మీడియా ఖాతాలో ఓ వీడియోను షేర్ చేశారు. ఇందులో మంచు లక్ష్మీ కుకింగ్ షోకు సంబంధించిన చిన్న వీడియోను షేర్ చేశారు. పాయల్ ఇంట్లో జరిగిన విషాదం గురించి అందరికీ తెలిసిందే. పాయల్ సోదరుడు తప్పిపోయిన విషయం అందరికీ తెలిసిందే. గతంలో పాయల్ ఈ మేరకు పోస్టులు వేసింది. తన సోదురుడు ఇంట్లోంచి వెళ్లిపోయాడని, ఎవరికైనా తెలిస్తే చెప్పండని పోస్టులు వేసింది.

ఇప్పుడు అదే విషయం మీద మంచు లక్ష్మీ కామెంట్ చేసినట్టు కనిపిస్తోంది. మీ బ్రదర్ ఇంట్లోంచి వెళ్లిపోయారు కదా? అని మంచు లక్ష్మీ అంటే..అవును అది కాస్త బాధగా ఉందని పాయల్ అంటుంది. దీనక్కా.. ఇది ఊరికే మాట్లాడుతోంది అని మంచు విష్ణు కౌంటర్ వేస్తాడు. నాకు నీ బాధ తెలుస్తోంది అని మంచు లక్ష్మీ అంటుంది. అవును అని పాయల్ అంటే.. విష్ణు కౌంటర్ వేస్తాడు. ఇదంతా షో చేస్తోంది. రియల్ రీల్ మీకు చూపిస్తా అని మంచు విష్ణు అంటాడు.

 

అలా మంచు విష్ణు అని అనడంతో.. పాయల్‌కు మండినట్టుంది. మంచు విష్ణుని ట్రోల్ చేయండి అని తన అభిమానులకు సూచించింది. అలా మొత్తానికి ఈ షోలో పాయల్, మంచు విష్ణులు సందడి చేసినట్టు కనిపిస్తోంది. మరి ఈ సినిమాతో మంచు విష్ణు హిట్ కొడతాడా?లేదా? అన్నది చూడాలి. అక్టోబర్ 21న అసలే తమిళ డబ్బింగ్ సినిమాలు కూడా రిలీజ్ కాబోతోన్నాయి. కార్తీ సర్దార్, శివ కార్తికేయన్ ప్రిన్స్ సినిమాలు బరిలో ఉన్నాయి. వీటిలో ఏది నిలబడుతుందో చూడాలి.

Also Read : Hansika Motwani Marriage : సైలెంట్‌గా హన్సిక పెళ్లి ఏర్పాట్లు.. వేదిక ఎక్కడంటే?

Also Read : Tamannaah Bhatia Marriage : పెళ్లి చేసుకుని తల్లవ్వాలని ఉందట.. తమన్నా కోరికలు

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News