Rishab Shetty Kantara : కాంతారా కథను ముందుగా ఆ హీరోకు చెప్పాడట.. రిషభ్ శెట్టి ఇంట్రెస్టింట్ కామెంట్స్
Rishab Shetty Kantara రిషభ్ శెట్టి కాంతారా సినిమా ఇప్పుడు ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసేస్తోంది. విడుదలై నెల దాటి పోతోన్నా వసూళ్లు మాత్రం తగ్గడం లేదు.
Rishab Shetty - Kantara- Puneeth Rajkumar : రిషభ్ శెట్టి నటించి, దర్శకత్వం వహించిన కాంతారా చిత్రం ఇప్పుడు ఇండియన్ బాక్సాఫీస్‌ను రఫ్పాడిస్తోంది. కాంతారా కన్నడ సినిమాగా మొదలైంది. సెప్టెంబర్ 30న విడుదలైన ఈ చిత్రం.. అక్టోబర్ 15న మిగిలిన అన్ని భాషల్లో విడుదలైంది. డబ్బింగ్ సినిమాగా విడుదలైన ఈ సినిమా అన్ని భాషల్లోనూ సక్సెస్ అయింది. హిందీ, తెలుగులో దాదాపు యాభై కోట్లు కొల్లగొట్టేసింది. తమిళ్, మలయాళంలోనూ మంచి కలెక్షన్లను రాబట్టేసింది. అలా మొత్తంగా ఈ చిత్రం మూడొందల కోట్ల క్లబ్బులోకి వచ్చేసింది.
కేవలం కన్నడలోనే నూటయాభై కోట్లకు పైగా రాబట్టేసింది. అయితే ఈ సినిమా చూసిన దైవకోల అనే సంప్రదాయం గురించి ఎక్కువగా చర్చించుకోవడం మొదలైంది. ఆ జాతి వారికి ప్రభుత్వం కూడా ప్రత్యేక సదుపాయాలు కల్పించింది. ఇక ఈ చిత్రం కన్నడలో అధిక మంది వీక్షించినట్టుగా రికార్డ్ సాధించింది. ఐఎండీబీలో టాప్ ప్లేస్‌లో చోటు దక్కించుకుంది. అలా కాంతారా సినిమా అన్ని రికార్డులను బద్దలు కొట్టేస్తోంది.
అయితే ఈ సినిమా గురించి తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. కాంతారా కథను ముందుగా పునీత్ రాజ్‌కుమార్‌కు చెప్పాడట రిషభ్ శెట్టి. ఇంట్రడక్షన్ సీన్‌లో దున్నలతో పోటీ పడే సీన్‌లో అప్పు అద్భుతంగా నటించేవాడని రిషభ్ శెట్టి అనుకున్నాడట. కథ చెప్పిన తరువాత పునీత్ ఫుల్ ఎగ్జైట్ అయ్యాడట. కానీ ముందుగా కమిట్ అయిన చిత్రాలు ఉండటం వల్లే ఈ సినిమా చేయలేకపోయాడట. నేను లేకపోయినా పర్లేదు.. ఈ సినిమాను మాత్రం చేసేయ్ అని అన్నాడట. దీంతో రిషభ్ శెట్టి హీరోగానూ కాంతారాకు ఫిక్స్ అయిపోయాడట.
ఒక వేళ పునీత్ రాజ్‌కుమార్ చేసి ఉంటే ఇంతకంటే ఎక్కువగా ఇంపాక్ట్ ఉండేదని అప్పు అభిమానులు అంటున్నారు. మొత్తానికి కాంతారా మాత్రం మరోసారి కన్నడ పరిశ్రమను కాలర్ ఎగిరేసేలా చేసేసిందన్నది మాత్రం నిజం. ఇప్పుడు హోంబలే అంటే బ్లాక్ బస్టర్‌లకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోంది.
Also Read : Recce At Pawan Kalyan House : పవన్ కల్యాణ్ ఇంటి ముందు రెక్కీ.. అసలు విషయం చెప్పిన పోలీసులు
Also Read : Tabu Casting Couch : టబుకి కూడా అలాంటివి తప్పలేదట.. బర్త్ డే స్పెషల్.. నాటి వార్తలు తెరపైకి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook