Rishab Shetty Remuneration: వామ్మో.. కాంతారా ప్రీక్వెల్ కోసం రిషబ్ శెట్టి అన్ని కోట్లు తీసుకుంటున్నాడా?
Kantara: కాంతార ప్రీక్వెల్ కోసం రిషబ్ శెట్టి భారీ రెమ్యూనరేషన్ అందుకోబోతున్నాడట. గతేడాది రిలీజైన కాంతార చిన్న సినిమాగా వచ్చి పాన్ ఇండియా లెవల్లో ఘన విజయాన్ని సాధించింది. దీనికి ప్రీక్వెల్ గా కాంతార: ఎ లెజెండ్ చాప్టర్ 1 తెరకెక్కుతోంది.
Rishab Shetty Remuneration: చిన్న సినిమాగా వచ్చిన కాంతార పాన్ ఇండియా లెవల్లో బాక్సాఫీస్ రికార్డులను షేక్ చేసింది. దీంతో రిషబ్ శెట్టి పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోయింది. ఏ మాత్రం అంచనాలు లేకుండా రిలీజైన ఈ సినిమా సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. గతేడాది రిలీజైన కాంతారా మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.400 కోట్లను కొల్లగొట్టింది. ఈ సినిమాకు రిషబ్ కేవలం రూ.4 కోట్లు మాత్రమే రెమ్యూనరేషన్ తీసుకున్నాడు. ప్రస్తుతం ఈ మూవీకి ప్రీక్వెల్ తెరక్కెంచి పనిలో పడ్డాడు ఈ హీరో. రీసెంట్ గా ఈ మూవీ టీజర్ ను కూడా విడుదల చేశారు మేకర్స్. అయితే ఈ రెండో పార్టు కోసం రిషబ్ కళ్లు చెదిరే రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడని టాక్.
కాంతారా రెండో పార్టు కోసం రిషబ్ శెట్టి ఏకంగా రూ.100 కోట్ల రెమ్యునరేషన్ అందుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మూవీపై అంచనాలు భారీగా ఉండటంతో.. అతని పారితోషికం కూడా 25 రెట్లు పెరిగి రూ.100 కోట్లకు చేరినట్లు సమాచారం. ఈ రెమ్యునరేషన్ లో సగం అంటే రూ.50 కోట్లు అడ్వాన్స్ గా అతనికి అందినట్లు తెలుస్తోంది. ఇక ఈ మూవీ రైట్స్ ను అమ్మిన తర్వాత వచ్చే లాభాల్లోనూ రిషబ్ శెట్టికి వాటా దక్కనుంది. డైరెక్టర్, యాక్టర్ గా అన్నీ తానై నడిపిస్తున్న రిషభ్ కు గోల్డెన్ టైమ్ నడుస్తుందన్న మాట. ప్రీక్వెల్ నుంచి రీసెంట్ గా విడుదలైన రిషబ్ ఫస్ట్ లుక్ ఆడియెన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంది. కాంతార: ఎ లెజెండ్ చాప్టర్ 1 అనే పేరుతో తెరకెక్కుతున్న ఈ మూవీ ఏడు భాషల్లో రిలీజ్ కానుంది. కన్నడంతోపాటు తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, బెంగాలీ, ఇంగ్లిష్ భాషల్లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook