Jigarthanda Double X OTT: ఓటీటీలోకి వచ్చేస్తోన్న 'జిగర్తాండ డబుల్ ఎక్స్'... స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?

Jigarthanda Double X: కోలీవుడ్ స్టార్ డైరెక్టర్  కార్తీక్‌ సుబ్బరాజు ఇటీవల జిగర్తాండ డబుల్ ఎక్స్ సినిమాతో ఆడియెన్స్ ముందుకు వచ్చి మంచి టాక్ తెచ్చుకుంది. తాజాగా ఈ మూవీ ఓటీటీ ఎంట్రీకి రెడీ అయింది. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 1, 2023, 11:44 AM IST
Jigarthanda Double X OTT: ఓటీటీలోకి వచ్చేస్తోన్న 'జిగర్తాండ డబుల్ ఎక్స్'... స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?

Jigarthanda Double X OTT Release Date: కోలీవుడ్ స్టార్స్ లారెన్స్, సూర్య లీడ్ రోల్స్ లో నటించిన చిత్రం జిగర్తాండ డబుల్ ఎక్స్. రీసెంట్ గా థియేటర్లలో సందడి చేసిన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద భారీగానే వసూళ్లను రాబట్టింది. పాన్ ఇండియా లెవల్లో రిలీజైన ఈ సినిమాకు సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అందించారు. స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ చిత్రానికి కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహించాడు. అయితే ఈ మూవీ ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని ఆడియెన్స్ ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఈ మూవీ వచ్చే శుక్రవారం (డిసెంబర్ 8) నుంచి నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కు రానుంది. 

జిగర్తాండ డబుల్ ఎక్స్ మూవీని తమిళంతోపాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో అందుబాటులో  తీసుకురానున్నారు. ఈ సినిమాలో నవీన్ చంద్ర, షైన్ టామ్ చాకో, నిమేషా సజయన్‌, సత్యన్‌, అర్వింద్‌ ఆకాష్‌ తదితరులు కీలకపాత్రలు పోషించారు. నవంబర్ 10న థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమా.. నెల రోజుల్లోపే ఓటీటీ ఎంట్రీ ఇస్తోంది. ఈ మూవీ కలెక్షన్లు నిరాశపరిచినప్పటికీ తమిళ స్టార్ హీరో ధనుష్ ఈ మూవీకి పాజిటివ్ రివ్యూ ఇచ్చారు. చివరి నలభై నిమిషాలు అద్భుతంగా ఉందంటూ ధనుష్ చేసిన ట్వీట్ నెట్టింట విపరీతంగా వైరల్ అయింది. ఈ చిత్రానికి కార్తికేయన్‌ సంతానం, ఎస్‌.కథిరేసన్‌, అలంకార్‌ పాండియన్‌ నిర్మాతలుగా వ్యవహారించారు. తిరు సినిమాటోగ్రఫీ, షఫీక్‌ మహ్మద్‌ అలీ ఎడిటింగ్ ఆకట్టుకుంది. 

Also Read: Rules Ranjan OTT: ఇవాళే ఓటీటీలోకి రూల్స్ రంజన్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News