Rishab Shetty in Jai Hanuman : ప్రముఖ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తక్కువ బడ్జెట్ తో.. తేజ సత్య హీరోగా, అమృత అయ్యర్ హీరోయిన్ గా, సముద్రఖని, వరలక్ష్మి శరత్ కుమార్, గెటప్ శ్రీను తదితరులు కీలకపాత్రలో తెరకెక్కిన చిత్రం హనుమాన్. చిన్న చిత్రంగా వచ్చిన ఈ సినిమా అతి తక్కువ సమయంలోనే రూ.100 కోట్ల క్లబ్ లో చేరి రికార్డు సృష్టించింది.  ముఖ్యంగా సంక్రాంతి బరిలో వచ్చిన ఈ సినిమాకు.. పోటీ గా నిలిచిన మహేష్ బాబు సినిమా కూడా నిలవలేదు అంటే ఇక ప్రశాంత్ వర్మ తన డైరెక్షన్ తో ఎలా ప్రేక్షకులను మెప్పించారో అర్థం చేసుకోవచ్చు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మరోవైపు కన్నడ ప్రాంతీయ దైవారాధన అంశాలను ఆధారంగా చేసుకొని కాంతారా సినిమాను తెరకెక్కించారు. ప్రముఖ నటుడు కం డైరెక్టర్ రిషబ్ శెట్టి. తొలుత ప్రాంతీయ సినిమాగా వచ్చిన ఈ సినిమా అక్కడ విజయం సాధించడంతో ఆ తర్వాత అన్ని భాషలలో కూడా విడుదలై పాన్ ఇండియా గుర్తింపును దక్కించుకుంది దీంతో రిషబ్ శెట్టి కి పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు రావడమే కాకుండా అప్పటివరకు ప్రాంతీయంగా మాత్రమే పరిమితమైన కన్నడ పరిశ్రమకు దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు లభించింది. 


ఇప్పుడు ఈ ఇద్దరి కాంబినేషన్లో సినిమా అంటూ ఒక వార్త తెర పైకి రావడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోందని చెప్పవచ్చు. అసలు విషయంలోకి వెళ్తే ప్రశాంత్ వర్మ యూనివర్స్ మూవీ అయినా హనుమాన్ సీక్వెల్ జై హనుమాన్ చిత్రానికి ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తూ ఉండగా.. ఈ చిత్రంలో కాంతారా హీరో రిషబ్ శెట్టి హీరో పాత్ర పోషించబోతున్నారు అంటూ ఒక వార్త తెరపైకి వచ్చింది.  ఒకవేళ ఇదే నిజమైతే వీరిద్దరి కాంబినేషన్లో రాబోయే సినిమా పాన్ వరల్డ్ మూవీగా రాబోతుంది అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.


Also Read: IAS Officers: ఆమ్రపాలితో సహా ఆ ఐఏఎస్‌లకు భారీ షాక్‌.. మొట్టికాయలు వేసిన క్యాట్‌


ఇదిలా ఉండగా మరోవైపు ప్రశాంత్ వర్మ బాలయ్య కొడుకు మోక్షజ్ఞ మొదటి చిత్రం బాధ్యతలు తీసుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమా పూర్తయిన వెంటనే జై హనుమాన్ మొదలుపెట్టే అవకాశాలు ఉన్నాయి.మరోవైపు కాంతారా ప్రీక్వెల్ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు రిషబ్ శెట్టి.  ఇప్పుడు తాజాగా వీరిద్దరిపై వస్తున్న వార్తలలో.. నిజమెంత ఉందో తెలియదు కానీ.. ఒకవేళ ఇదే నిజమైతే జై హనుమాన్ రావడానికి ఇంకా కొన్ని సంవత్సరాలు.. పట్టే అవకాశం ఉందని చెప్పవచ్చు.


Also Read: AP Cadre IAS: ఆంధ్రప్రదేశ్‌కు మేం వెళ్లలేం.. మళ్లీ కోర్టును ఆశ్రయించిన ఐఏఎస్‌లు



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి