Rishab Shetty's Kantara Telugu Official Trailer: ఇప్పుడు కన్నడ సినిమాలకు ఇతర భాషలో మంచి ఆదరణ లభిస్తోంది. గతంలో కన్నడ సినిమాలు అంటే ఇతర బాషల సూపర్ హిట్ సినిమాలను ఎక్కువగా రీమేక్ చేసేవారు. కానీ కేజీఎఫ్ సిరీస్ ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్న తర్వాత తమ కథలను ప్రపంచానికి చెప్పేందుకు కన్నడ సినీ మేకర్స్ సిద్ధమయ్యారు. అందులో భాగంగానే కన్నడ సినీ పరిశ్రమ నుంచి వస్తున్న పలు సినిమాలు ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రక్షిత్ శెట్టి హీరోగా వచ్చిన అతడే శ్రీమన్నారాయణ ఇటీవల రిలీజ్ అయిన 777 చార్లీ వంటి సినిమాలు ప్రేక్షకులు ఆకట్టుకోగా రాజ్ బి శెట్టి స్వీయ దర్శకత్వంలో హీరోగా నటించిన గరుడ గమన వృషభవాహన సినిమా కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇప్పుడు ఆ సినిమాలో కీలకపాత్రలో నటించిన రిషబ్ శెట్టి హీరోగా ‘కంటారా’ అనే ఒక ఫిలిం కన్నడ నాట విడుదలైంది. సెప్టెంబర్ 30వ తేదీన విడుదలైన ఈ సినిమా అద్భుతమైన రెస్పాన్స్ దక్కించుకుంటుంది.


ఇప్పటికే దాదాపు 60 కోట్ల రూపాయల వరకు వసూలు చేసినట్టు చెబుతున్నారు. అందులోనూ కేవలం 57 కోట్ల దాకా ఒక్క కన్నడ రాష్ట్రం నుంచి వచ్చాయని అంటున్నారు. ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ రావడంతో ఇతర భాషల్లో కూడా డబ్బింగ్ చేసి విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు మేకర్స్.  తెలుగు, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమాని అక్టోబర్ 15వ తేదీన విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేసుకోవడమే కాక దానికి సంబంధించిన ట్రైలర్స్ కూడా విడుదల చేశారు.


ఆసక్తికరంగా సాగుతున్న ఈ ట్రైలర్ సినిమా మీద మరింత అంచనాలు పెంచేసింది రిషబ్ శెట్టి హీరోగా స్వీయ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను కేజిఎఫ్ నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్ బ్యానర్ మీద విజయ్ కిరణ్గాదూర్ నిర్మించడంతో మరింత ఆసక్తి నెలకొంది. ఇక ఈ సినిమా కూడా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుని 777 చార్లీ, కేజిఎఫ్ లాగా ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. చూడాలి మరి ఏం జరగబోతుంది అనేది.
 



Also Read: Mistakes in God Father: చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమాలో ఈ తప్పులని మీరు గమనించారా?


Also Read: Rashmika - Devarakonda: దేవరకొండతో కలిసి మాల్దీవులకు రష్మిక.. 'అవి' పెట్టుకోవడంతో అడ్డంగా బుక్కయ్యారుగా!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook