RRR @1000 Crores: రూ. 1000 కోట్ల క్లబ్ దాటిన ఆర్ఆర్ఆర్.. తొక్కుకుంటూ పోతున్న తెలుగు సినిమా
రూ. 100 కోట్లు, రూ. 200 కోట్లు వసూళ్లు అనేది గతంలో మాట. ఇప్పుడు ఏకంగా రూ. 500 కోట్లు, రూ. 1000 కోట్లు వసూళ్లు అంటూ దూసుకుపోతోంది. `బాహుబలి`, ఆర్ఆర్ఆర్ సినిమానే నిదర్శనం. ఆర్ఆర్ఆర్ కలెక్షన్ లకు బాలీవుడ్ వర్గాలు నివ్వెరపోతున్నాయి.
RRR Collections Crosses Rs.1000 Crores: టాలీవుడ్ అంచెలంచెలుగా ఎదుగుతోంది. రూ. 100 కోట్లు, రూ. 200 కోట్లు వసూళ్లు అనేది గతంలో మాట. ఇప్పుడు ఏకంగా రూ. 500 కోట్లు, రూ. 1000 కోట్లు వసూళ్లు అంటూ దూసుకుపోతోంది. మొన్నటి మొన్న 'బాహుబలి' వసూళ్లతో బాలీవుడ్‌ను సైతం అవాక్కు చేసింది. చరిత్రలో ఏ భారతీయ మూవీకి సాధ్యంకాని కలెక్షన్‌లను అందుకుంది. ఇప్పుడు దేశంలో ట్రెండింగ్ ఉన్న 'ఆర్‌ఆర్‌ఆర్' కూడా అదే బాటలో దూసుకుపోతోంది.
మార్చి 25న విడుదల అయిన ఈ సినిమా రూ. 1000 కోట్ల కలెక్షన్‌ల మైలురాయిని దాటింది. దాదాపు రూ. 500 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన మూవీ ఇది. విదేశాలతో పాటు భారతదేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ విడుదల అయ్యి సంచలన విజయం సాధించింది. ఒక్క నైజాంలోనే 100 కోట్ల కలెక్షన్ అందుకున్న తొలి సినిమాగా నిలిచింది. దాదాపు అన్ని దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ వసూళ్ల పరంగా ఆల్‌టైమ్ రికార్డ్ సృష్టించింది. విడుదల అయ్యి రెండు వారాలు దాటినా బాక్సాఫీస్ వద్ద 'ఆర్‌ఆర్‌ఆర్' ప్రభంజనం తగ్గలేదు.
ఈ మూవీ ఒక్క హిందీ బెల్ట్‌లోనే రూ. 200 కోట్ల కలెక్షన్‌లను రాబట్టినట్టు సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. ఆర్‌ఆర్ఆర్ మూవీ యూనిట్ ముంబైలో సక్సెస్‌మీట్ నిర్వహించింది. బాలీవుడ్ హీరో ఆమిర్‌ఖాన్, దర్శక నిర్మాత కరణ్ జోహర్, రచయిత జావేద్ అక్తర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. నిర్మాత డి.వి.వి. దానయ్య, జితేంద్ర, హుమాఖురేషీ, అశుతోష్ గోవారికర్, సతీష్ కౌశిక్, తదితరులు పాల్గొన్నారు. పెన్ స్టూడియోస్ అధినేత జయంతిలాల్ ఈ కార్యక్రమంలో రాజమౌళి, యంగ్ టైగర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌ను సత్కరించారు. ముగ్గురూ కేక్ కట్ చేసి సినిమా విజయాన్ని ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు.
సుమారు ఐదు వందల కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమాను డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై డివివి దానయ్య నిర్మించారు. మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా ఈ పాన్ ఇండియా సినిమా రిలీజ్ అయింది. 1920లో బ్రిటీష్ బ్యాక్‌డ్రాప్‌తో సాగే పీరియాడిక్ మూవీ ఇది. ఇందులో కొమురం భీమ్‌గా తారక్, అల్లూరి సీతారామరాజుగా చరణ్ కనువిందు చేసారు.
Also Read: RBI MPC meet: కీలక వడ్డీ రేట్లు యథాతథం- ఇకపై అన్ని ఏటీఎంలలో కార్డ్‌లెస్ విత్‌డ్రా!
Also Read: Ghani Movie Review: గని మూవీ ఎలా ఉంది? వరుణ్ తేజ్ హిట్టు కొట్టాడా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook