RRR Wins 6 Awards at 69th National Film Awards: 69వ నేషనల్ ఫిలిం అవార్డ్స్‌లో పుష్ప సినిమాకు గాను ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ విజేతగా నిలవగా.. గంగూబాయి కతియావాడి చిత్రంతో అలియా భట్, మిమి మూవీకి గాను క్రితి సనన్ ఉత్తమ నటి అవార్డులు గెలుచుకున్నారు. ఇక ఉత్తమ సినిమా కేటగిరిలో రాకెట్రీ ఉండగా.. ఉత్తమ తెలుగు సినిమా కేటగిరిలో ఉప్పెన మూవీ నిలిచింది. వీటి తరువాత మళ్లీ ఎక్కువ పేరు వినిపించిన సినిమా మన తెలుగు దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి డైరెక్ట్ చేసిన ఆర్ఆర్ఆర్ మూవీనే. ఔను, ఆస్కార్ అవార్డ్స్‌లో నాటు నాటు పాటతో రచ్చరచ్చ చేసిన ఆర్ఆర్ఆర్ మూవీ 69వ నేషనల్ ఫిలిం అవార్డ్స్‌లోనూ తన సత్తా చాటుకుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

95వ ఆస్కార్ అవార్డ్స్‌లో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ఆస్కార్ అవార్డ్ సొంతం చేసుకుని యావత్ ప్రపంచానికి నాటు నాటు రుచి చూపించిన ఆర్ఆర్ఆర్ మూవీకి సొంత గడ్డపై కూడా అవార్డుల పంట పండింది. 2021 లో విడుదలైన ఈ చిత్రం ఆ ఏడాదికి గాను ప్రకటించిన నేషనల్ ఫిలిం అవార్డ్స్‌లో మొత్తం 6 కేటగిరీల్లో 6 అవార్డులు కైవసం చేసుకుంది.


సంపూర్ణ వినోదం అందించిన ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం కేటగిరిలో RRR మూవీ తొలి నేషనల్ ఫిలిం అవార్డ్ గెలుచుకోగా.. RRR మూవీకి బెస్ట్ బ్యాగ్రౌండ్ స్కోర్ అందించిన కీరవాణిని నేషనల్ అవార్డ్ వరించింది. ఇదే సినిమాకి పాటపాడిన కాల భైరవ ఉత్తమ నేపథ్య గాయకుడు అవార్డు గెలుచుకోగా, ఆర్ఆర్ఆర్ సినిమాతోనే ప్రముఖ కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ కి సైతం ఉత్తమ కొరియోగ్రఫీ అవార్డు వరించింది. ఆర్ఆర్ఆర్ సినిమాకు స్పెషల్ ఎఫెక్ట్స్ అందించిన శ్రీనివాస్ మోహన్ కు ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ అవార్డు, అలాగే ఉత్తమ స్టంట్ కొరియోగ్రఫీ అవార్డు కూడా ఆర్ఆర్ఆర్ సినిమా వశమైంది. ఇలా మొత్తం ఆరు కేటగిరీల్లో ఆరు నేషనల్ అవార్డ్స్ గెలుచుకున్న ఆర్ఆర్ఆర్ మూవీ మరోసారి టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. 


ఇది కూడా చదవండి : 69th National Film Awards 2023 Winners: అల్లు అర్జున్, RRR, ఉప్పెన, చంద్రబోస్.. మళ్లీ తెలుగు వాళ్లదే హవా


ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత 69వ నేషనల్ ఫిలిం అవార్డ్స్‌ విజేతల జాబితాలో చోటుదక్కించుకున్న వారిలో ప్రముఖ మ్యూజిక్ కంపోజర్ దేవి శ్రీ ప్రసాద్, ఫేమస్ లిరిసిస్ట్ చంద్రబోస్ కూడా ఉన్నారు. అల్లు అర్జున్ బెస్ట్ యాక్టర్ అవార్డ్ గెలుచుకున్న పుష్ప సినిమాకే మ్యూజిక్ (పాటలు) కంపోజ్ చేసిన దేవి శ్రీ ప్రసాద్‌కి ఉత్తమ సంగీత దర్శకుడు అవార్డ్ కైవసం చేసుకున్నాడు. అలాగే కొండ పొలం మూవీలో దమ్ ఢాం ఢాం పాటకు బెస్ట్ లిరిక్స్ అందించిన చంద్రబోస్ నేషనల్ అవార్డు సొంతం చేసుకున్నారు.


ఇది కూడా చదవండి : Allu Arjun: అల్లు అర్జున్‌ను గట్టిగా హగ్ చేసుకున్న సుకుమార్.. బన్నీకి అభినందనల వెల్లువ



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి