RRR OTT Streaming: దేశమంతా ఆసక్తిగా ఎదురు చూసిన ఆర్ఆర్ఆర్ సినిమా విడుదలైంది. ఎక్క ఏ థియేటర్ వద్ద చూసినా పండుగ వాతావరణం కన్పిస్తోంది. మరోవైపు ఆర్ఆర్ఆర్ ఓటీటీ స్ట్రీమింగ్‌పై స్పష్టత వస్తోంది. ఎప్పుడు, ఎందులోనంటే..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బాహుబలి దర్శకుడు రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా మార్చ్ 25వ తేదీన విడుదలై హిట్ దిశగా దూసుకుపోతోంది. చరిత్రలోని ఇద్దరు సమరయోధులు కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు కలిస్తే ఎలా ఉంటుందనే ఆలోచనతో స్టోరీ రూపుదిద్దుకుంది. భారీ ప్రోజెక్ట్ సినిమాగా విడుదలై..హిట్ టాక్ తెచ్చుకుంది. కొమరం భీమ్‌గా జూనియర్ ఎన్టీఆర్ నటిస్తుండగా..అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్ నటిస్తున్నాడు. 


దేశంలో ప్రతి ధియేటర్ వద్ద భారీగా హంగామా నెలకొంది. ఇద్దరు హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ల నటన ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటోంది. ఓ వైపు హిట్ దిశగా దూసుకుపోతుంటే..మరోవైపు ఓటీటీ స్ట్రీమింగ్ విషయంపై అప్‌డేట్ వెలువడింది. సాధారణంగా ప్రతి కొత్త సినిమా విడుదలైన నెలరోజుల తరువాత ఓటీటీలో విడుదలవుతోంది. అదే క్రమంలో ఆర్ఆర్ఆర్ సినిమా కూడా నెలరోజుల తరువాత ఓటీటీలో విడుదలవుతుందని అందరూ ఆశించారు. అయితే తాజా అప్‌డేట్ నిరాశే మిగుల్చుతోంది. లాక్‌డౌన్ నేపధ్యంలో అంతటా ఓటీటీ హవా నడుస్తోంది. చాలా వరకూ సినిమాలు ఓటీటీలోనే విడుదలవుతున్నాయి.


అయితే ఆర్ఆర్ఆర్ సినిమా మిగిలిన సినిమాల్లా నెల రోజుల తరువాత ఓటీటీలో స్ట్రీమ్ అయ్యేందుకు అవకాశం లేదని తెలుస్తోంది. థియేటర్లలో విడుదలైన మూడు నెలల వరకూ ఆర్ఆర్ఆర్ సినిమా ఓటీటీలో విడుదలయ్యే ప్రసక్తే లేదని తెలిసింది. అంటే జూన్ తరువాత ఓటీటీలో ఆర్ఆర్ఆర్ విడుదల కానుందని సమాచారం. ఇక తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం వెర్షన్‌ను జీ5 భారీ డీల్‌కు సొంతం చేసుకుంది. హిందీ వెర్షన్ మాత్రం నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసింది. 


Also read: Ananya Nagalla Photos: అందంతో మతిపొగ్గొట్టేస్తుంది 'వకీల్ సాబ్' పోరి!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook