RRR Records: దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్​ఆర్​ఆర్' మూవీ కలక్షన్ల వర్షం కురిపిస్తోంది. రామ్​ చరణ్​, ఎన్​టీఆర్​లు హీరోలుగా నటించిన.. ఈ సినిమా తెలుగులో చిత్రీకరించినా.. పాన్​ ఇండియా లెవల్లో వివిధ భాషల్లో డబ్​ అయింది. అలా విడుదలైన హిందీ వెర్షన్​ను మంచి స్పందన లభిస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మార్చి 25న విడుదలైన ఈ మూవీ హిందీ వెర్షన్​.. ఏప్రిల్ 6వ తేదీ వరకు రూ.200 కోట్ల కలెక్షన్లు రాబట్టిందని ప్రముఖ సనీ విశ్లేషకులు తరుణ్​ ఆదర్శ్​ చెప్పుకొచ్చారు. కరోనా తర్వాత ఈ స్థాయి వసూళ్లు సాధించిన రెండో హిందీ చిత్రంగా ఈ మూవీ నిలిచినట్లు వెల్లడించారు. ఇక క్షయ్​ కుమార్ హీరోగా నటించిన సూర్య వంశి మూవీ మొత్తం మీద రూ.200 కోట్ల వసూళ్లు రాబట్టిందని చెప్పుకొచ్చారు.


ఇక మరో తెలుగు సినిమా.. పుష్ప ఉత్తరాదిన రూ.100 కోట్ల కలెక్షన్లు రాబట్టిందని టాక్​. గత ఏడాది డిసెంబర్​లో విడుదలైన పుష్ప మూవీలో అల్లు అర్జున్ హీరోగా నటించగా.. రశ్మిక మందాన్న హీరోయిన్. సుకుమార్ ఈ మూవీకి దర్శకత్వం వహించారు.


ఇక ఇప్పటి వరకు ఆర్​ఆర్​ఆర్​ మూవీ రూ.1000 కోట్ల వరకు వసూళ్లు సాధించిందని అంచనా.



ఆర్​ఆర్​ఆర్​ మూవీ గురించి..


స్వాతంత్ర్యం రాకముందు పరిస్థితులను అధారంగా చేసుకుని రాసిన కల్పిత కథతో తీసిందే ఆర్​ఆర్​ఆర్​. ఈ సినిమాలో ఆలియా భయ్​, ఒలివియా మోరిస్​లు హీరోయిన్లుగా నటించారు. అజయ్​ దేవ్​గన్​, సముద్రకని, శ్రియా, రాహుల్​ రామకృష్ణ సహా పలువురు కీలక పాత్రల్లో నటించారు.


Also read: Bandla Ganesh on Pawan Kalyan: మీకు తిరుగులేదు దేవర... పవన్ కల్యాణ్‌పై బండ్ల గణేశ్ లేటెస్ట్ కామెంట్స్...


Also read: RGV Dangerous: రాంగోపాల్ వర్మ లెస్బియన్ మూవీ 'డేంజరస్' విడుదల వాయిదా...


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook