RGV Dangerous: రాంగోపాల్ వర్మ లెస్బియన్ మూవీ 'డేంజరస్' విడుదల వాయిదా...

RGV Dangerous Movie Postponed: థియేటర్ యాజమాన్యాల తీరుతో దర్శకుడు రాంగోపాల్ వర్మ తన 'డేంజరస్' సినిమా విడుదలను వాయిదా వేసుకోక తప్పలేదు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 7, 2022, 03:53 PM IST
  • రాంగోపాల్ వర్మ డేంజరస్ మూవీ విడుదల వాయిదా
  • ట్విట్టర్‌ ద్వారా వెల్లడించిన ఆర్జీవీ
  • థియేటర్ యాజమాన్యాలు ముందుకు రాకపోవడంతో పోస్ట్ పోన్
RGV Dangerous: రాంగోపాల్ వర్మ లెస్బియన్ మూవీ 'డేంజరస్' విడుదల వాయిదా...

RGV Dangerous Movie Postponed: డైరెక్టర్ రాంగోపాల్ వర్మ తాజా చిత్రం ' మా ఇష్టం డేంజరస్' విడుదల వాయిదా పడింది. ఈ సినిమాను ప్రదర్శించేందుకు థియేటర్ యాజమాన్యాలు ముందుకు రాకపోవడంతో విడుదల వాయిదా వేయక తప్పలేదు. ఈ విషయాన్ని రాంగోపాల్ వర్మ తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. అంతేకాదు, ఈ అన్యాయంపై పోరాడుతామని... త్వరలోనే కొత్త విడుదల తేదీని ప్రకటిస్తామని తెలిపారు.

'మా ఇష్టం DANGEROUS సినిమా విడుదల విషయం లో లెస్బియన్ సబ్జెక్ట్ మూలాన చాలా థియేటర్లు దాన్ని ప్రదర్శించేందుకు ముందుకు రావట్లేదు. కాబట్టి సినిమా విడుదలను వాయిదా వేస్తున్నాము. అన్ని విధాలుగా ఈ అన్యాయాన్ని ఎలా ఎదుర్కోవాలో పరిశీలించి తగు చర్యలు తీసుకున్న తరువాత మరో విడుదల తేదీ తెలియ చేస్తాను.' అని రాంగోపాల్ వర్మ ప్రకటించారు.

లెస్బియన్ కంటెంట్ అయినంత మాత్రానా డేంజరస్ సినిమా విడుదలకు సహకరించకపోవడంపై థియేటర్ యాజమాన్యల పట్ల వర్మ ఆగ్రహంగా ఉన్నారు. ఒకరకంగా ఇది మానవ హక్కులను అవమానించడమేనని తన గత ట్వీట్లలో పేర్కొన్నారు. ఇద్దరు స్వలింగ సంపర్కులైన యువతుల మధ్య ప్రేమ, క్రైమ్ డామా కథతో వర్మ డేంజరస్ సినిమాను తెరకెక్కించారు. అప్సర రాణి, నైనా గంగూలీ ఇందులో లెస్బియన్ జంటగా నటించారు. తెలుగుతో పాటు పలు ఇతర భాషల్లో ఈ నెల 8న  ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది. అయితే థియేటర్ యాజమాన్యాల తీరుతో సినిమా వాయిదా పడటంతో వర్మ నెక్స్ట్ స్టెప్ ఏంటనేది ఆసక్తికరంగా మారింది. 

Also Read: Telangana Weather Report: వాతావరణ శాఖ రిపోర్ట్.. రానున్న మూడు రోజుల్లో వర్షాలు?

Also Read: Optical Illusion: ఈ చిత్రంలో తేడాను గమనించారా? ఆరుగురు ఉంటే 5 జతల కాళ్లే కనిపిస్తున్నాయి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News