RRR on Zee5: రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా సూపర్ డూపర్ హిట్‌గా నిలిచి..బాక్సాఫీసు వద్ద రికార్డు కలెక్షన్లు సృష్టిస్తోంది. మరో నాలుగు రోజుల్లో జీ5లో స్ట్రీమింగ్ కానున్న ఈ సినిమాను ఎలా చూడాలో తెలుసుకోండి..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా మరో నాలుగు రోజుల్లో అంటే మే 20వ తేదీన జీ5లో స్ట్రీమింగ్ కానుంది. ఈ చిత్రం జీ5లో కేవలం దక్షిణాది భాషలైన తెలుగు, తమిళం, కన్నడ, మళయాలంలో మాత్రమే స్ట్రీమింగ్ కానుంది. అయితే మిగిలిన ఓటీటీల్లో చూసినట్టు ఈ సినిమా చూడలేరు. టీ వీవోడీ పద్ధతి లేదా పే పర్ వ్యూ పద్ధతిలో ఈ సినిమాను చూడాల్సి వస్తుంది. జీప్లెక్స్ ద్వారా అద్దె ప్రాతిపదికన ఈ సినిమా చూడాల్సి వస్తుంది.


టీ వీవోడీ అంటే అంటే ఏంటి


ప్రస్తుతం జీ5 సబ్‌స్క్రిప్షన్ ఏడాదికి 599 రూపాయలకు లభిస్తోంది. ఇప్పుడు మీరు ఆర్ఆర్ఆర్ చూడాలంటే..మరో వంద రూపాయలు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఆర్ఆర్ఆర్‌తో కలిపి మొత్తం 699 రూపాయలకు తీసుకుంటే ఏడాది సబ్‌స్క్రిప్షన్‌తో పాటు..ఆర్ఆర్ఆర్ సినిమా వారం రోజులపాటు అందుబాటులో ఉంటుంది. ఇది వరకూ సబ్‌స్క్రిప్షన్ ఉన్నా సరే..అద్దె అదనంగా చెల్లించాల్సిందే. అందే దీనిని పే పర్ వ్యూ అంటారు. 


Also read: OTT & Theatre Release Movies: ఈ వారం ధియేటర్, ఓటీటీల్లో సందడి చేయనున్న సినిమాలివే


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.